త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు

SSCTU | ప్రతిష్టాత్మక సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTU) 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గాను వివిధ అండ‌ర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. సీయూఈటీ యూజీ (CUET UG), జేఈఈ మెయిన్స్ (JEE Main)లో అర్హ‌త సాధించిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

G

Telangana | Published On Jul 25, 2026, 7.56 am IST

SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
Advertisement

SSCTU | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రతిష్టాత్మక సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTU) 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గాను వివిధ అండ‌ర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. సీయూఈటీ యూజీ (CUET UG), జేఈఈ మెయిన్స్ (JEE Main)లో అర్హ‌త సాధించిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆయా ప‌రీక్ష‌ల్లో వ‌చ్చిన మార్కుల‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 130 సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ కోర్సులు నాలుగేండ్ల కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. మొత్తం 5 కోర్సుల‌ను అందిస్తున్న‌ది.

కోర్సులు.. సీట్లు

బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- 30 సీట్లు
బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్- 25 సీట్లు
బీఎస్సీ హానర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్‌- 25 సీట్లు
ఈ మూడు కోర్సుల‌ను ఐఐటీ హైదరాబాద్‌తో (IIT HYderabad) అందిస్తున్నది. ఇది నాలుగేండ్ల కోర్సులు.

బీఏ హానర్స్ ఇంగ్లిష్- 25 సీట్లు
బీఏ హానర్స్ ఎకనామిక్స్- 25 సీట్లు

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: బీటెక్ కోర్సుల‌కు రూ.500, బీఏ కోర్సుల‌కు రూ.300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు బీటెక్ కోర్సుకు రూ.250, బీఏ కోర్సులకు రూ.150. ఫీజు చెల్లించిన రశీదును పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 3
మెరిట్ జాబితా: ఆగస్టు 5
సీట్ల కేటాయింపు: ఆగస్టు 11
వెబ్‌సైట్‌: https://ssctucuet.samarth.edu.in/

Advertisement
Advertisement