త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NTA Examination Calendar | జ‌న‌వ‌రి 22 నుంచి జేఈఈ మెయిన్‌-1.. వివిధ‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన ఎన్‌టీఏ

NTA Examination Calendar | దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించే ప‌లు ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుద‌ల చేసింది.

S

Telangana | Published On Sep 17, 2026, 4.56 pm IST

NTA Examination Calendar | జ‌న‌వ‌రి 22 నుంచి జేఈఈ మెయిన్‌-1.. వివిధ‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన ఎన్‌టీఏ
Advertisement

NTA Examination Calendar | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించే ప‌లు ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుద‌ల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు జరిగే వివిధ ప్రవేశ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ వివ‌రాల‌ను త‌న అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్ల‌డించింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి.

జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జనవరి 22-24, 28-30వ తేదీ వరకు ఆరు రోజులపాటు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వచ్చే నెలలో పరీక్ష నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇక జేఈఈ మెయిన్‌ చివరి విడతను ప్రకటించకున్నా అది ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కుల ఆధారంగా 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. అందులో ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు.

ఈ తేదీలు తాత్కాలికమైనవ‌ని.. పరిపాలనా, విద్యా, చట్టపరమైన, లాజిస్టిక్స్ లేదా ఇతర అనుకోని పరిస్థితుల కారణంగా తేదీలలో మార్పులు జరిగే అవకాశాలున్న‌ట్లు ఎన్‌టీఏ తెలిపింది.

Advertisement
Advertisement