SSC Exams | రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు..
SC Exams | ఇంటర్ పరీక్షలు శుక్రవారంతో ముగియనున్నాయి. శనివారం (మార్చి 14) నుంచి పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16న పరీక్షలు అయిపోతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
SSC Exams | త్రినేత్ర.న్యూస్: ఇంటర్ పరీక్షలు శుక్రవారంతో ముగియనున్నాయి. శనివారం (మార్చి 14) నుంచి పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16న పరీక్షలు అయిపోతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.27 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 517,727 మంది, మరో 10,512 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరికోసం 2,676 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
కాగా, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9.35 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించేంది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందుగానే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.
- రాష్ట్రంలో మొత్తం పరీక్షా కేంద్రాలు: 2,676
ప్రభుత్వ పాఠశాలలు: 1,562
ప్రైవేటు పాఠశాలలు: 1,094 - పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు (రెగ్యులర్): 517,727
బాలురు: 260,916
బాలికలు: 256,811 - గతంలో ఉత్తీర్ణులు కానివారు: 10,512
బాలురు: 7,038
బాలికలు: 3,474
ఏ రోజు.. ఏ పరీక్ష అంటే..
ఇవికూడా చదవండి..
కొవిడ్ తరహాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మనం అధిగమిస్తాం : ప్రధాని మోదీ
సన్ రైజర్స్ యాజమాన్యానికి షాక్.. పాక్ ప్లేయర్‌ను కొన్న అనంతరం ఎక్స్ ఖాతా సస్పెన్షన్..
అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. ఇరాక్‌లో కుప్పకూలిన సైనిక విమానం
తాజావార్తలు
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
- ●Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా
- ●TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
- ●Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
- ●KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్..!
- ●Horoscope | సెప్టెంబర్ 29 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?

Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా

TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్

Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత




