TG Tenth results | మే మొదటి వారంలో ‘పది’ ఫలితాలు.. వాట్సాప్‌కే మార్కుల మెమో
TG Tenth results | తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉందని ఎస్సెస్సీ బోర్డు అధికారులు తెలిపారు.
TG Tenth results | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉందని ఎస్సెస్సీ బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇక మిగిలింది కేవలం సాంఘిక శాస్త్రమే. ఈ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 23 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. మూల్యాంకనం పూర్తయిన తర్వాత మార్కులన్నింటినీ క్రోడికరించేందుకు వారం రోజుల సమయం పడుతుంది. మొత్తానికి మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
ఈ ఏడాది పది పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,67,954 మంది బాలురు, 2,60,285 మంది బాలికలు ఉన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పది పరీక్షలను నిర్వహించారు.
వాట్సాప్‌కే మార్కుల మెమో
- 80969 58096ను మీ కాంటాక్ట్‌లో "Mee Seva Telangana"గా సేవ్ చేయాలి.
- వాట్సాప్ తెరిచి "Hi" అని పంపగానే మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది.
- "BIE Exam Result" టైప్ చేసి Open Service నొక్కాలి.
- మీ రూల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్‌మిట్ చేయగానే ఫలితం తక్షణమే వాట్సాప్‌లో ప్రత్యక్షమవుతుంది.
- ఆ తర్వాత మీ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






