త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | స్పీక‌ర్ తీరు రాజ్యాంగానికే గొడ్డ‌లిపెట్టు: కేటీఆర్‌

KTR | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత (Disqualification) పిటిషన్లను స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను తిరస్కరించడం అర్థరహితమ‌ని మండిప‌డ్డారు.

A

Telangana | Published On Feb 4, 2026, 3.44 pm IST

KTR | స్పీక‌ర్ తీరు రాజ్యాంగానికే గొడ్డ‌లిపెట్టు: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత (Disqualification) పిటిషన్లను స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టని బీఆర్ఎస్ (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ (Sanjay) కి కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను తిరస్కరించడం అర్థరహితమ‌ని మండిప‌డ్డారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేన‌ని దుయ్య‌బ‌ట్టారు. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదని స్ప‌ష్టం చేశారు.

ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమేన‌న్నారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్స్ అంటే భయపడుతోందని అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని తేలిపోయిందన్నారు. పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement