Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
Gurrala Nagaraju | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామికమని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు.
Gurrala Nagaraju | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామికమని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు.
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులను శాసనసభకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవద్దని రాష్ట్ర డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి చెంపపెట్టులాంటిదని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన హక్కని, పోలీసు బలంతో ప్రతిపక్ష గొంతును అణచివేయాలని ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలను వెంటనే నిలిపివేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా శాసనసభకు హాజరై ప్రజల సమస్యలను ప్రస్తావించే వాతావరణాన్ని కల్పించాలని నాగరాజు గుర్రాల డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ చేపట్టే పోరాటాలకు దక్షిణాఫ్రికాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు
- ●Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!
- ●Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్
- ●Heavy Rains | మండపాల్లో వినాయకులు జాగ్రత్త.. ఎందుకంటే..?
- ●Sreeleela | రాధలా ముస్తాబైన శ్రీలీల.. పింక్ లెహంగాలో అదుర్స్!

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!

Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్





