BRS MLAs | సభా వేదికల్లో మా ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇస్తలేరు
BRS MLAs | ప్రభుత్వ కార్యక్రమ సభా వేదికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (Sudheer Reddy), సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), కేపీ వివేకానంద (KP Vivekananda) ఆరోపించారు.
- కాంగ్రెస్ నాయకులకు పదవులు లేకున్నా వేదికలపై కూర్చుంటున్నరు
- మా హక్కులు కాపాడాలని సీఎస్‌కు ఫిర్యాదు చేశాం.. ఆయన స్పందించాలి
- మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సబిత, వివేకానంద ఆవేదన
BRS MLAs | త్రినేత్ర న్యూస్: ప్రభుత్వ కార్యక్రమ సభా వేదికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (Sudheer Reddy), సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), కేపీ వివేకానంద (KP Vivekananda) ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి పదవులు లేకున్నా సభల్లో వేదికలపై కూర్చుంటున్నారని మండిపడ్డారు. ఇందుకు అధికారులూ వత్తాసు పలుకుతున్నారన్నారు. మూడు సంవత్సరాలు ఓపిక పట్టామని.. ఇప్పుడు సీఎస్ సంజయ్ జాజు (CS Sanjay Jaju)కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు (Complaint) చేశామని తెలిపారు. శుక్రవారం సచివాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. శాసన సభ్యుల హక్కులు కాపాడాలని సీఎస్ ను కోరినట్లు సుధీరెడ్డి పేర్కొన్నారు.
ఓడిన అభ్యర్థిని అసెంబ్లీకి పిలుస్తారేమో: సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సీఎస్ కు ఫిర్యాదు చేశాం. గతంలో పార్టీలకు అతీతంగా సర్పంచులకు పనులు అప్పగించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి పెత్తనం చెలాయిస్తున్నారు. ఇంత ప్రొటోకాల్ ఉల్లంఘనలు గతంలో ఎప్పుడూ లేవు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. అనధికారంగా ఓడిపోయినవారు పెత్తనం చెలాయిస్తున్నారు. మేం గెలిచినా మాకు మర్యాద ఉండడం లేదు. మేం అసెంబ్లీకి కూడా రావద్దని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. తన పార్టీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని అసెంబ్లీకి పిలిపించుకునేలా రేవంత్ చట్టం చేస్తారేమో.
సీఎస్ స్పందించాలి: కె.పి. వివేకానంద, బీఆర్ఎస్ఎల్పీ విప్
రేవంత్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు రావాలని పాట్లు పడుతున్నారు. మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు. చిల్లర గొడవలకు దిగుతున్నారు. గతంలో నాయకులకు గౌరవం ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలో ఒక రాజ్యాంగం.. ఇక్కడొక రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సీఎస్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. దీనిపై ఇప్పటికైనా స్పందించాలి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | డీలిమిటేషన్‌కు అనుకూలంగా ఓటు వేస్తం.. కానీ: కేటీఆర్
- ●Telangana Industrial Policy 2.0 | విదేశాలకు వెళ్లకుండానే విదేశీ విద్య.. తెలంగాణలో 11 కొత్త పాలసీలు!
- ●Trisha | "విశ్వంభర" మరోసారి వాయిదా - త్రిష కెరీర్లో రిలీజ్‌కు ఎక్కువ రోజులు టైమ్ పట్టిన సినిమా ఇదే
- ●blast in school | పాఠశాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి
- ●Harish Rao meets Jagga Reddy | 21 ఏండ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్‌రావు
- ●Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!

KTR | డీలిమిటేషన్‌కు అనుకూలంగా ఓటు వేస్తం.. కానీ: కేటీఆర్

Telangana Industrial Policy 2.0 | విదేశాలకు వెళ్లకుండానే విదేశీ విద్య.. తెలంగాణలో 11 కొత్త పాలసీలు!

Trisha | "విశ్వంభర" మరోసారి వాయిదా - త్రిష కెరీర్లో రిలీజ్‌కు ఎక్కువ రోజులు టైమ్ పట్టిన సినిమా ఇదే

blast in school | పాఠశాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి




