Smart Phone Blast | భానుడి భగభగలకు.. పేలిపోయిన స్మార్ట్‌ఫోన్.. బీ కేర్‌ఫుల్..!
Smart Phone Blast | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. భానుడి భగభగలు మనషులకే ప్రమాదకరంగా మారాయనుకుంటే పొరపాటే. మండుటెండలకు వాహనాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. చివరకు ప్రతి ఒక్కరూ వినియోగించే స్మార్ట్ ఫోన్లను కూడా మండుటెండలు వెంటాడుతున్నాయి.
Smart Phone Blast | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. భానుడి భగభగలు మనషులకే ప్రమాదకరంగా మారాయనుకుంటే పొరపాటే. మండుటెండలకు వాహనాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. చివరకు ప్రతి ఒక్కరూ వినియోగించే స్మార్ట్ ఫోన్లను కూడా మండుటెండలు వెంటాడుతున్నాయి. తీవ్రమైన ఎండలో స్మార్ట్ ఫోన్లను వినియోగించడంతో.. అవి హీటెక్కి పేలిపోతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో మండుటెండలకు ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయిన ఘటన వెలుగు చూసింది.
కామారెడ్డి జిల్లా మక్దంపూర్ మాజీ సర్పంచ్ చంద్ర గౌడ్‌కు తన స్మార్ట్‌ఫోన్‌ను షర్ట్ జేబులో ఉంచుకున్నాడు. ఇక ఎండలోనే తిరుగుతూ.. వచ్చిన కాల్స్‌ను స్వీకరించాడు. మొత్తానికి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో చంద్ర గౌడ్ షాక్ అయ్యాడు. తన జేబు కూడా స్వల్పంగా కాలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఫోన్‌ను జేబులో నుంచి విసిరేశాడు. ఎండ వేడిమి వల్లే ఫోన్ పేలిపోయిందని ఆయన పేర్కొన్నాడు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఎండలో ఎక్కువసేపు తిరిగేటప్పుడు ఫోన్‌ను ప్యాంట్ జేబుల్లో ఉంచకపోవడం మంచిది. శరీర వేడి, ఎండ వేడి కలిసి ఫోన్ త్వరగా వేడెక్కుతుంది నిపుణులు పేర్కొంటున్నారు. కారు డాష్‌బోర్డ్ పైన లేదా బైక్ హోల్డర్లలో ఫోన్‌ను నేరుగా ఎండ తగిలేలా ఉంచకండి. ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు. అలాగే ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడటం, గేమ్స్ ఆడటం పూర్తిగా నిషేధించాలి. ఫోన్ ఎక్కువగా వేడెక్కుతున్నట్లు అనిపిస్తే, కాసేపు దాని బ్యాక్ కవర్‌ను తీసి పక్కన పెట్టడం మంచిది.
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ




