Drugs Case | డ్రగ్స్ కేసులో సిట్ దూకుడు.. రోహిత్‌రెడ్డిని కస్టడీకి కోరిని పోలీసులు
Drugs Case| మొయినాబాద్ (Moinabad) డ్రగ్స్ పార్టీ (Drugs party) కేసులో సిట్ (SIT) అధికారుల విచారణ (Enquiry) కొనసాగుతోంది. తాజాగా శంషాబాద్ పోలీసుస్టేషన్‌లో నిందితులను విచారించారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి(Rohith Reddy)ని పోలీసులు త్వరలోనే ఫామ్ హౌజ్‌కు తీసుకెళ్లి విచారించనున్నారు.
త్రినేత్ర.న్యూస్: మొయినాబాద్ (Moinabad) డ్రగ్స్ పార్టీ (Drugs party) కేసులో సిట్ (SIT) అధికారుల విచారణ (Enquiry) కొనసాగుతోంది. ఇప్పటికే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌజ్‌ను సీజ్ చేశారు. తాజాగా శంషాబాద్ పోలీసుస్టేషన్‌లో నిందితులను విచారించారు. అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, శరత్‌కుమార్, విజయ కృష్ణ, రమేష్, శ్రావణ్‌కుమార్, ప్రియాంకరెడ్డి విచారణకు హాజరయ్యారు. స్టేషన్ బెయిల్ పొందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ హాజరు కాలేదు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి (Rohith Reddy) ని పోలీసులు త్వరలోనే ఫామ్ హౌజ్‌కు తీసుకెళ్లి విచారించనున్నారు.
ఇప్పటికే జైల్లో ఉన్న రోహిత్‌రెడ్డి, అతని తమ్ముడు రితీష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీ (custody)కి అనుమతివ్వాలని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై 18న ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును 20కి వాయిదా వేసింది. 20న న్యాయస్థానానికి సెలవు ఉండడంతో తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
అసైని పేరు మీదే ఫామ్‌హౌజ్ భూమి..
ఫామ్ హౌజ్‌కు సంబంధించిన భూ రికార్డులు ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు రెవెన్యూ అధికారులను కోరారు. అజీజ్‌నగర్ సర్వే నం. 177/33 లోని 2.20 ఎకరాల విస్తీర్ణంలో రోహిత్‌రెడ్డి ఫౌమ్‌హౌజ్ ఉంది. రోహిత్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి పేరు మీద 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది అసైన్డ్ భూమి కావడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అసైని అంతంగారి జంగయ్య పేరే ఉన్నది. అయితే పాత రికార్డుల్లో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు సైతం పాత రికార్డులను పరిశీలిస్తున్నారు.
సంబంధిత వార్తలు

SIT for investigate social media posts | బండి భగీరథ్ కేసులో మరో సిట్.. సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తుకు ఏర్పాటు
మే 19, 2026

Bandi Bhagirath | బండి భగీరథ్ కేసులో మరో సిట్.. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దర్యాప్తు
మే 19, 2026

Horoscope | మే 18 రాశి ఫలాలు.. ఉమ్మడి ఆస్తుల విషయంలో జాగ్రత్త!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



