RS Praveen Kumar | బాంబు మెయిల్ ఎలా లీకైంది? అంతర్గతంగా వెరిఫై చేయకుండా బయటకెలా వచ్చింది?
RS Praveen Kumar | హైదరాబాద్(Hyderabad)లో ముంబయి తరహా బాంబు దాడులు చేస్తామని వచ్చిన మెయిల్ (Mail)పై అంతర్గతంగా వెరిఫై చేయకుండా అది బయటకెలా వచ్చిందని.. దీనిపై విచారణ జరపాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) డిమాండ్ చేశారు.
- ఇది కోటి మంది ప్రజల సమస్య.. దీనిపై విచారణ జరపాలి
- ఉగ్రవాదులు మెయిల్ పంపకుండా అటాక్ చేస్తరు
- రేవంత్ హోంమంత్రిగా ఉన్నంతకాలం ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు.. ఆయన రాజీనామా చేయాలి
- హైదరాబాద్ గ్యాంగ్ వార్‌లకు అడ్డాగా మారింది
- మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు
RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్(Hyderabad)లో ముంబయి తరహా బాంబు దాడులు చేస్తామని వచ్చిన మెయిల్ (Mail)పై అంతర్గతంగా వెరిఫై చేయకుండా అది బయటకెలా వచ్చిందని.. దీనిపై విచారణ జరపాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు మెయిల్ పంపకుండా అటాక్ చేస్తారని తెలిపారు. ఇది కోటి మంది ప్రజల సమస్య అని చెప్పారు. మెయిల్‌ను లీక్ చేసి, పోలీస్ అధికారులకు పంపినందుకు రేవంత్ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆయన ఉన్నంత కాలం ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ గ్యాంగ్ వార్‌లకు అడ్డాగా మారిందని ఆరోపించారు.
జాయింట్ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చింది ఒక లేఖ విడుదలైంది. అది కేవలం అందరూ ఇన్స్‌పెక్టర్స్, ఏసీపీ, డీసీపీలకు వెళ్తుంది. అలర్ట్ ఆన్ టెర్రర్ టు రిపీట్ 26/11 ముంబయి టెర్రర్ అటాక్స్ ఇన్ హైదరాబాద్ పేరిట నవంబర్ 21న లేఖ వచ్చింది. లష్కర్ ఎ తోయిబా నాయకుడు లతీఫ్ భట్ ను ఇండియన్ ఆర్మీ చంపినందుకు బదులుగా ఈ దాడులకు పాల్పడుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇది అంతర్గతంగా ఉండాలి. కాన్ఫిడెన్షియల్ లేదా హైలీ కాన్ఫిడెన్షియల్ అని లేఖలో చెప్పలేదు. మా దగ్గరికి రావద్దు. నేను కూడా 2009 నుండి 2011 వరకు పని చేశాను. ఈ మెసేజ్ అన్ని సామాజిక మాధ్యమాల్లో లభ్యమైంది. హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్, అధిక ప్రజా ప్రాబల్యం ఉన్న చోటలో లో 300 మందిని చంపుతామని లష్కరే తోయిబా నుండి మెయిల్ వచ్చినట్టు ఈ లేఖలో చెప్పారు. సీఐ, ఏసీపీ, డీసీపీల వద్ద ఉండాల్సిన మెసేజ్.. సామాజిక మాధ్యమాల్లో వచ్చింది.
మౌనమే సీఎం సమాధానమా?
తర్వాత పుకార్లు నమ్మొద్దని పోలీసు అధికారులు చెప్పారు. ఒరిజినల్ లేదా ఫేక్ ఆ అని వెరిఫై చేస్తున్నామని డీజీపీ చెప్పారు. మెయిల్ వచ్చినపుడే ఎందుకు వెరిఫై చేయలేదు? లుంబినీ పార్క్ అటాక్ లో మేం కూడా ఇన్వెస్టిగేషన్ చేశాం. తర్వాత కూడా చాలా చోట్ల అటాక్ జరిగింది. ప్రతిసారీ ఉగ్రవాదులు ఇలా మెయిల్స్ పంపరు. పంపకుండా అటాక్ చేస్తారు. ఒక సారి మెయిల్ వచ్చినపుడు అది, సామాజిక మాధ్యమాల్లోకి ఎలా వచ్చింది? ఎలా లీక్ అయింది? ఇది కోటి మంది ప్రజల సమస్య.. దీనిపై విచారణ జరపాలి. దీనిపై ఇంత వరకు ముఖ్యమంత్రి స్పందించడం లేదు. మౌనమే ఆయన సమాధానంగా ఉంది.
నగరంలో హింస ఎక్కువైంది
హైదరాబాద్ లో ఎన్నడూ లేనంత హింస జరుగుతున్నది. హైదరాబాద్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ముర్తుజా పహిల్వాన్ ను రాత్రి ఇకో పార్క్ వద్ద దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. గత నెలలో మల్కాజిగిరి కమిషనరేట్ లో ఖమ్మం రౌడీ గ్యాంగులు.. ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో రౌడీ షీటర్ ను నరికి చంపారు. ఇటీవల పాలు అమ్ముకునే వ్యక్తి మీద కూడా జరిగింది. హైదరాబాద్ నగరానికి సిలికాన్ వ్యాలీ అనే పేరు ఉంది. డల్లాస్ తో పోటీ పడుతున్న హైదరాబాద్ గ్యాంగ్ వార్ కు అడ్డాగా మారింది.
కేటీఆర్ పట్టణ, ఐటీ, పరిశ్రమల మంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్ వర్ధిల్లింది. కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టారు. విజిబుల్ పోలీసింగ్ జరిగేది. పోలీసులు రోడ్ల మీద ఉండి అనుమానిత వాహనాలను తనిఖీ చేసేవారు. 40 వేల మంది పోలీసులను రిక్రూట్ చేసి కాపాడారు. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టారు. సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ బలోపేతం చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్స్ పెంచారు.
రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణలో పోలీసు శాఖ పతనమైంది. మెటా అనే కంపెనీ ఆఫీసుల మీద పట్టపగలే యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేసి.. మేమే చేశామంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రపంచ కంపెనీలను తెస్తున్నామని నమ్మబలుకుతూ మల్టీ నేషనల్ కంపెనీల మీద దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ ను వెనుకేసుకొస్తున్నారు. నాకు భయమేస్తున్నది.. కానీ ప్రజల సంక్షేమం కోసం చెప్పాలి. రేవంత్ రెడ్డి కళ్లు తెరెవాలి.
ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని మార్కెట్‌లో అమ్ముతున్నరు
అవసరమైనపుడు కోట్లు పెట్టి మీటింగ్ లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ ఇంటలిజెన్స్ ఏం చేస్తుంది? గతంలో జర్నలిస్టుల మీద ఉపా కేసు పెట్టమన్నారని కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీ పేరుతో సహా సమాచారం లీక్ అయింది. ఫోన్ ట్యాపింగ్ చట్ట ప్రకారమే జరుగుతది. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని చూశారు. సినిమా తారల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని లీక్ చేసి, తర్వాత తప్పించుకుంటున్నారు. అసలు పోలీస్ శాఖలో ఉండే కొన్ని డిపార్ట్ మెంట్స్ ఎవరికీ తెలియదు. పోలీసులకు కూడా చాలా మందికి తెలియదు. కానీ ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఇపుడు మార్కెట్ లో అమ్ముతున్నారు. కూరగాయలు, పండ్ల వలే అమ్ముతున్నారు.
పబ్‌ల ముందు నిలబడుతున్నరు
కేసీఆర్ హయాంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ఆక్టోపస్ ఇంటర్ సెప్టర్ వెహికిల్స్ పెట్టి కమాండోలను పెట్టి ఉగ్రవాదులు రావాలంటే కూడా బయపడేలా చేశారు. నిరంతరం అనుమానిత వాహనాలను తనిఖీ చేసేవారు. ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు. కేవలం శుక్రవారం రాత్రి 8 గంటలకు పబ్ ల ముందు బ్రీత్ అనలైజర్ పట్టుకొని నిలబడుతున్నారు. పోలీసులే పబ్ ఓనర్లతో మిలాఖత్ అవుతున్నారు. ఎంపీ సోదరుడు పీకల దాకా తాగి కొట్టుకుంటే.. పోలీసులు నేరస్థులను వేడుకుంటున్నారు.
మెటా మీద దాడి సిగ్గుచేటు. ట్రిలియన్ డాలర్ల కంపెనీ. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా నడుపుతున్న కంపెనీ. మెటా కంపెనీపై దాడి చేసిన దుండగులను, కేవలం 3 గంటలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టి వదిలేశారు. గతంలో కేటీఆర్ గురించి అశ్లీల థంబ్‌నేల్స్ పెట్టినందుకు, బీఆర్ఎస్వీ కార్యకర్తలు మహా టీవి ఛానల్ పై దాడి చేస్తే 16 రోజులు జైలు.. నల్ల బాలు రైతుల గురించి మాట్లాడితే 16 రోజులు జైలు.. మెటా కంపెనీపై దాడి చేసిన నిందితులను, రేవంత్ రెడ్డి శభాష్ అని మెచ్చుకొని ఉంటరు. సంధ్యా రావు ఫేక్ అకౌంట్ ను పరిచయం చేసిన మహా వ్యక్తి రేవంత్ రెడ్డి.
మర్డర్ జరుగుతుంటే ఏం చేస్తున్నరు?
ఇకో పార్క్ వద్ద మర్డర్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ హోటల్స్, ఆఫీసులకు వెళ్తే సెక్యూరిటీ కూడా వాహనాలు తనిఖీ చేస్తారు. సెక్యూరిటీ గార్డుల కంటే ఘోరమా పోలీసులు? పోలీసుల దృష్టి అంతా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మీదనే ఉంది. రెండు నెలల క్రితం ఎంఐఎం ఎమ్మెల్సీని సస్పెండ్ చేసింది మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని. దీనిపై సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ యువ నాయకుడు డీజీపీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వీడియోలు తీసుకొని పోలీసులు వెరిఫై చేయకుండా.. బాధిత మహిళపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి, ఆమెతో ఉన్న వారందిరిపై కన్ఫెషన్ కేసు పెట్టి, అందులో సల్మాన్ ఖాన్ పేరు పెట్టి అందరిని చంచల్ గూడ జైలుకు పంపారు.
నేను రహమత్ బేగ్ తో కలిసినట్టు ఆధారాలు ఉంటే చూపించాలి. 5 కోట్లు అడిగిన ఆధారాలు ఉంటే చూపాలని సల్మాన్ ఖాన్ సవాల్ చేశారు. పోలీసులు స్పందించి ఆధారాలు బయటపెట్టాలి. అక్రమ కేసులు పెట్టి, ఫేక్ చార్జిషీట్ రాస్తున్నారు. ఈ అక్రమ కేసు వెనుక ఫయీమ్ ఖురేషి పేరు కూడా బయటకు వస్తుంది. ఆయన స్పందించాలి. రేవంత్ రెడ్డి హోం మంత్రికి పనికిరారు. కేటీఆర్ ప్రపంచ దేశాల నుండి కంపెనీలు తెస్తే.. యూత్ కాంగ్రెస్ నాయకులేమో కంపెనీలపై దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హోం మంత్రిగా రాజీనామా చేయాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, సీనియర్ నాయకులు మంద శ్యాం, కొంకటి శేఖర్, శ్రీనివాస్ యాదవ్, అబ్రార్ హుస్సేన్, అరుణ క్వీణ్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●PM Modi | మళ్లీ ఎన్డీఏ గూటికి శిరోమణి అకాలీదళ్.. స్వాగతించిన ప్రధాని మోదీ
- ●MeitY | కంప్యూటర్ ఉత్పత్తులను ప్రభుత్వాలు కొనాలంటే కొత్త నిబంధనలు.. భారత్‌లో తయారవ్వాల్సిందే..
- ●Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం - ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - మెగా వెర్స్ ప్రోమో రిలీజ్
- ●Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!
- ●Harish Rao | నీళ్ల లెక్కలడిగితే.. అబద్ధాల వరద పారిస్తున్నడు
- ●Badi Lake Udaipur | కరువు నుంచి ఉదయ్‌పూర్‌ను కాపాడిన 350 ఏళ్ల చారిత్రక చెరువు.. ఈ 'బడీ లేక్' విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

PM Modi | మళ్లీ ఎన్డీఏ గూటికి శిరోమణి అకాలీదళ్.. స్వాగతించిన ప్రధాని మోదీ

MeitY | కంప్యూటర్ ఉత్పత్తులను ప్రభుత్వాలు కొనాలంటే కొత్త నిబంధనలు.. భారత్‌లో తయారవ్వాల్సిందే..

Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం - ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - మెగా వెర్స్ ప్రోమో రిలీజ్

Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!





