Singareni | ఇక సింగరేణికి సోలార్ వెలుగు..
Singareni | సింగరేణి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీఎంఈఎల్)లో సోలార్ వెలుగులను సంతరించుకుంది. సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బడా ప్రకాశ్ జ్యోతి బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
- 300 కిలోవాట్లతో ప్లాంట్ ప్రారంభం
- ఏటా రూ.24లక్షల విద్యుత్ ఖర్చులు ఆదా
Singareni | సింగరేణి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీఎంఈఎల్)లో సోలార్ వెలుగులను సంతరించుకుంది. సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బడా ప్రకాశ్ జ్యోతి బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సంస్థ ఆవరణలో నిర్మించిన సీసీ, ఆర్‌సీసీ రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో సింగరేణితో పాటు దాని అనుబంధ సంస్థల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎండీ తెలిపారు.
ఏపీఎంఈఎల్ 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రూ.63.13 కోట్ల టర్నోవర్, రూ.23.33 కోట్ల రికార్డు నికర లాభం సాధించడంపై ఉద్యోగులను అభినందించారు. గత ఏడాది భట్టి విక్రమార్క ఏపీఎంఈఎల్ సందర్శన సందర్భంగా ఇచ్చిన సూచనలతో సంస్థ అభివృద్ధికి కొత్త దిశ లభించిందని ఆయన పేర్కొన్నారు. స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఏపీఎంఈఎల్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా సింగరేణి సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఐదేళ్లలో పెట్టుబడి రికవరీ
ఏపీఎంఈఎల్ ప్లాంట్, కాలనీ విద్యుత్ అవసరాలకు ప్రస్తుతం ఏటా సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతోంది. రూ.1.24 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం రూ.24 లక్షల వరకు ఆదా కానుంది. సుమారు ఐదేళ్లలో పెట్టుబడి తిరిగి రానుందని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. ఏపీఎంఈఎల్ చైర్మన్ ఎన్‌వీకే శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికలను వివరించారు. సింగరేణి, కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ వంటి సంస్థల నుంచి వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, గౌతమ్ పోత్రు, ఎం తిరుమలరావు, ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఏపీఎంఈఎల్ నుంచి ఎండీ ఎర్రన్న, ఇతర అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్






