Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 10న పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు..
Trains Cancelled | మీరు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారా? అయితే మీరు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు వెళ్లాల్సిన రైలు రద్దు ((Trains Cancelled) ) కావడమో లేదా షెడ్యూల్ సమయానికి ముందుగానో.. ఆలస్యంగానో నడిచే అవకాశం ఉంది.
Trains Cancelled | త్రినేత్ర.న్యూస్: మీరు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారా? అయితే మీరు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు వెళ్లాల్సిన రైలు రద్దు ((Trains Cancelled) ) కావడమో లేదా షెడ్యూల్ సమయానికి ముందుగానో.. ఆలస్యంగానో నడిచే అవకాశం ఉంది. కాజీపేట-బల్లార్షా రైల్వే సెక్షన్‌లో ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైళ్ల రాకపోకల్లో మరింత భద్రత, వేగం పెంచేందుకు ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఈ మార్గంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇందులో భాగంగా జమ్మికుంట-పొత్కపల్లి (jammikunta-pothkapally) స్టేషన్ల మధ్య సుమారు 17 కిలోమీటర్ల పరిధిలో నాన్ ఇంటర్‌లాకింగ్ సాంకేతిక పనులు చేపడుతున్నారు. దీంతో సెప్టెంబర్ 10న పలు ప్యాసింజర్, మెము, ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు కొన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నారు. అదేవిధంగా దూరప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే (SCR) అధికారులు వెల్లడించారు.
ఈ రైళ్లు రద్ధు..
- కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట రామగిరి మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను (నం.17003 / 17004) పూర్తిగా రద్దు.
- సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్ (17033 / 17034)- భద్రాచలం రోడ్ - బల్లార్షా మధ్య నడిచే ఈ రైలును వరంగల్ - బల్లార్షా మధ్య రద్దు చేశారు.
- అదేవిధంగా సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్ మధ్య నడిచే సర్వీస్‌ను సిర్పూర్ టౌన్ - వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
- ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (17011/17012)- హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-బీదర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట - సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
మారిన రైళ్ల సమయాలు
- భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233)- సెప్టెంబర్ 10 న ఈ రైలు నిర్ణీత సమయం కంటే 1 గంట ఆలస్యంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
- మెము ప్యాసింజర్ (67771 / 67773) సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - బోధన్ మధ్య నడిచే ఈ రైలు కూడా 1 గంట పాటు రీషెడ్యూల్ చేశారు.
సమయాల్లో స్వల్ప మార్పులు..
- దానాపూర్ - ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్(22365) సెప్టెంబర్ 9న బయలుదేరే ఈ రైలును మార్గమధ్యంలో 75 నిమిషాల పాటు ఆపుతారు.
- ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు - దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (22366) సెప్టెంబర్ 9న బయలుదేరే ఈ సర్వీస్‌ను 45 నిమిషాలు ఆలస్యంగా నడుపుతారు.
- తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12622) న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ఈ రైలును సెప్టెంబర్ 9న 30 నిమిషాల పాటు నిలిపివేస్తారు.
- అండమాన్ ఎక్స్‌ప్రెస్ (12622) చెన్నై సెంట్రల్ - శ్రీమాత వైష్ణోదేవి కట్రా మధ్య నడిచే ఈ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబర్ 10న 30 నిమిషాల పాటు నిలివేస్తారు.
తాజావార్తలు
- ●Zipline Rescue Nepal | వరదలో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. నేపాల్‌లో రెండు ఊర్లను కలుపుతున్న 250 మీటర్ల 'జిప్‌లైన్'
- ●Heart Attack | గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
- ●Live-In Partner | 40 ఏండ్ల మహిళతో 20 యువకుడి సహజీవనం.. నడిరోడ్డుపై కట్టేసి కొట్టిన పోలీసులు
- ●High Court CJ | 8 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు
- ●Miss World | డొమినిక్ రిపబ్లిక్ భామకు మిస్ వరల్డ్ కిరీటం
- ●BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..

Zipline Rescue Nepal | వరదలో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. నేపాల్‌లో రెండు ఊర్లను కలుపుతున్న 250 మీటర్ల 'జిప్‌లైన్'

Heart Attack | గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

Live-In Partner | 40 ఏండ్ల మహిళతో 20 యువకుడి సహజీవనం.. నడిరోడ్డుపై కట్టేసి కొట్టిన పోలీసులు

High Court CJ | 8 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు






