త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padi Koushik Reddy | దివ్యాంగుల పెన్షన్లు రూ.6,000కు పెంచాలి

Padi Koushik Reddy | వృద్ధాప్య‌, వితంతు పెన్ష‌న్ల‌ను రూ.4000కు, దివ్యాంగుల పెన్ష‌న్ల‌ (Pensions) ను రూ.6000 వేల‌కు పెంచాల‌ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Koushik Reddy) డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Nov 17, 2026, 4.50 pm IST

Padi Koushik Reddy | దివ్యాంగుల పెన్షన్లు రూ.6,000కు పెంచాలి
Advertisement
  • వృద్ధాప్య, వితంతు పెన్షన్లు 4,000 వేలు ఇవ్వాలి
  • జమ్మికుంట పట్టణ అభివృద్ధికి 100 కోట్లు, హుజురాబాద్ నియోజకవర్గానికి 1,000 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి
  • పేద కుటుంబాల‌కు పథకాలు అందేవరకు పోరాటం ఆగదు
  • జ‌మ్మికుంట‌లో పెన్ష‌న్ల పంపిణీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Padi Koushik Reddy | త్రినేత్ర న్యూస్: వృద్ధాప్య‌, వితంతు పెన్ష‌న్ల‌ను రూ.4000కు, దివ్యాంగుల పెన్ష‌న్ల‌ (Pensions) ను రూ.6000 వేల‌కు పెంచాల‌ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Koushik Reddy) డిమాండ్ చేశారు. దళిత బంధు పొందిన కుటుంబాల్లో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందించాలన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే హుజురాబాద్‌లో 44,373 మందికి లబ్ధి చేకూరింద‌న్నారు. జమ్మికుంట పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్లు, హుజురాబాద్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్స్‌లో మంగ‌ళ‌వారం చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ల‌బ్ధిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్ష‌న్లు పెంచాల‌న్నారు. ఇంకా పెన్షన్లు అందని అర్హులైన పేదలకు వెంటనే మంజూరు చేయాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక అవసరం

రానున్న ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా, హుజురాబాద్ నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధులు మంజూరయ్యేలా అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement