Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్
Mahesh Kumar Goud | తెలంగాణలో 3 కోట్ల 38 లక్షల ఓట్లు ఉంటే 73 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అనుసంధానం కానీ ఓట్లు 32 లక్షల 37 వేలు ఉన్నాయన్నారు.
- 1.6 కోట్ల ఓట్లను క్వచ్చన్ మార్క్‌లో ఎందుకు పెట్టారో చెప్పాలి
- ఎలక్షన్ కమిషన్ వివరాలు ఇవ్వాలి
- మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో 3 కోట్ల 38 లక్షల ఓట్లు ఉంటే 73 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అనుసంధానం కానీ ఓట్లు 32 లక్షల 37 వేలు ఉన్నాయన్నారు. 2002 ఓటర్ లిస్టు వివరాలతో సంబంధంల లేకుండా వివరాలు సరిగా ఉంటే ఓటు హక్కు కల్పించాలన్నారు. 2002 కండిషన్ పెట్టడం వల్ల ఎన్యూమరేషన్ ఫాం ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఎల్ఏలు 35 వేల ఓట్లకు రిసిప్ట్ ఇచ్చారు. 13 వేల 100 మంది అని ఎలక్షన్ కమిషన్ చూపిస్తోంది. కోటి 60 లక్షల ఓటర్లకు క్వచ్చన్ మార్క్ పెట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ప్రతిపక్షాల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టారు.
రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును కాపాడాలని ప్రయత్నించాం. బీహార్, వెస్ట్ బెంగాల్‌లో మాదిరి తెలంగాణలో ఓట్ల తొలగింపు జరిగింది. బీద ప్రజల ఓట్లను తొలగించారు. 2002 వివరాలను కాకుండా వివరాలు సరిగ్గా ఉంటే ఓటు హక్కు కల్పించాలి. ప్రతి పౌరుడి ఓటు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది.
ఎస్ఐఆర్‌కు ఇంకా సమయం ఇవ్వాల్సి ఉంది. గడువు పొడిగించాలి. 92 లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అర్హత కలిగిన ఓటును కాపాడాల్సిన బాధ్యత ఉంది. బీఎల్ఏ లిస్ట్ ఇచ్చిన తర్వాతా తప్పు ఎలా చూపిస్తారు. ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఓట్లు తొలగించే కండీషన్ పెట్టారు. కోటి 60 లక్షల ఓటర్లను క్వచ్చన్ మార్క్‌లో ఎందుకు పెట్టారో వివరాలు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నాం అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
ఆగస్టు 18, 2026

Peddi Swapna | నువ్ లేని రోజు ఇంత కష్టమొస్తదనుకోలే.. విగ్రహం తొలగిస్తే తట్టుకోలేకపోతున్నం
ఆగస్టు 18, 2026

Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
- ●Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్
- ●Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
- ●Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
- ●Defence Manufacturing | రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు.. కీలక ఉత్పత్తులు సొంతంగా తయారీ..
- ●Tiger | పట్ట పగలు.. గుర్రాన్ని చంపిన పెద్ద పులి.. వీడియో

Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి

Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..

Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు




