Peddi Swapna | నువ్ లేని రోజు ఇంత కష్టమొస్తదనుకోలే.. విగ్రహం తొలగిస్తే తట్టుకోలేకపోతున్నం
Peddi Swapna | నర్సంపేటలోని ఓ ప్రైవేట్ స్థలంలో పెట్టిన దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై ఆయన భార్య పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎవరో అభిమాని ప్రేమతో విగ్రహం పెట్టుకుంటే దారుణంగా తొలగించారని కన్నీటిపర్యంతమయ్యారు.
- ప్రైవేట్ స్థలంలో పెట్టిన విగ్రహాన్ని తొలగించారు
- ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని దారుణంగా అవమానించారు
- మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైన పెద్ది భార్య స్వప్న
Peddi Swapna | త్రినేత్ర.న్యూస్: నర్సంపేటలోని ఓ ప్రైవేట్ స్థలంలో పెట్టిన దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై ఆయన భార్య పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎవరో అభిమాని ప్రేమతో విగ్రహం పెట్టుకుంటే దారుణంగా తొలగించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదినం రోజునే అధికారులను పురమాయించి విగ్రహం తొలగించారని వాపోయారు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని అవమానిస్తే తట్టుకోలేకపోతున్నానన్నారు.
ఇన్ని రోజులు తొలగించకుండా సడెన్‌గా దొంతి జన్మదినాన్ని పురస్కరించుకొనే విగ్రహాన్ని తొలగించాలని అధికారులకు చెప్పడంతోనే ఇదంతా జరుగుతుంది. మా సార్ లేని రోజు మాకు గింత పెద్ద కష్టం వస్తదని మేం అస్సలు అనుకోలే. ఆయన ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించేటోడు. నా గురించి, మా పిల్లల గురించి కూడా ఆలోచించకపోయేది. ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని ఇంత దారుణంగా అవమానిస్తున్నరు. ఒక్క విగ్రహం.. అది పెద్ద విగ్రహం కూడా కాదు. అట్లని కూడళ్ల, జన సంచారం ఉన్న ప్రాంతంల కూడా పెట్టలేదు. అసలు ఆ విగ్రహం ఎవరో అభిమాని ఆయన ప్రేమతో పెట్టుకున్నడు. మాగ్గూడా ఆ విషయం తెల్వదు. ఆ విగ్రహం తొలగించిర్రంటే మేం తట్టుకోలేకపోతున్నం.
కాగా గత రాత్రి 3 గంటలకు.. 1500 మంది పోలీసుల పహారా మధ్య దొంగచాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేస్తున్నారు. నల్లబెల్లిలోని పెద్ది నివాసం చుట్టూ 400 మంది పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో
కంటతడి పెట్టుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు నాడే ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని 1500 మంది పోలీసుల బందోబస్తుతో కూలగొట్టి చదును చేసిన అధికారులు https://t.co/nlhCZjWbKw pic.twitter.com/d5J3eNQ1Lp
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2026
సంబంధిత వార్తలు

Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల
ఆగస్టు 18, 2026

Kalwakuntla Kavitha | సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు
ఆగస్టు 18, 2026

Vinod Kumar | అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●CM Vijay | అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?
- ●Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల
- ●Kalwakuntla Kavitha | సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..
- ●Mallikarjun Kharge | నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్న పిల్లాడు.. మీరా మాకు దేశభక్తి పాఠాలు చెప్పేది..? ఖర్గే
- ●Vinod Kumar | అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్

CM Vijay | అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?

Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల

Kalwakuntla Kavitha | సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు

YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..



