Tiger | పట్ట పగలు.. గుర్రాన్ని చంపిన పెద్ద పులి.. వీడియో
Tiger | పులులు ఇతర జంతువులను వేటాడడం సహజమే. అయితే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్రంపై పెద్దపులి దాడి చేసి ప్రాణాలు తీసింది.
Tiger | త్రినేత్ర.న్యూస్ : పులులు ఇతర జంతువులను వేటాడడం సహజమే. అయితే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్రంపై పెద్దపులి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌లోని గార్జియా ఏరియాలో వెలుగు చూసింది.
అది నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్ ఏరియా. జాతీయ రహదారి 309. ఈ రహదారి గార్జియా టూరిజం జోన్‌కు అనుసంధానించి ఉంటుంది. అయితే సోమవారం మిట్ట మధ్యాహ్నం 1.30 గంటలకు.. గార్జియా టూరిజం గేట్ వద్ద చెట్ల పొదల్లో నుంచి పెద్ద పులి ప్రత్యక్షమైంది. అదే సమయంలో ఆ మార్గంలోనే ఓ గుర్రం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకేముంది.. ఆ గుర్రం రక్తాన్ని కళ్లారా చూసింది పెద్ద పులి. గుర్రం మెడ పట్టి చెట్ల పొదల్లోకి పెద్ద పులి లాక్కెళ్లింది. అనంతరం దాన్ని చంపేసింది టైగర్.
ఈ ఘటనను చూసి స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గుర్రంపై పులి దాడి చేయడంతో షాకయ్యారు. పెద్ద ఎత్తున కేకలు వేశారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితి సమీక్షించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. పులి కదలికల నేపథ్యంలో స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
View this post on Instagram
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ - పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ - లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం
- ●Peddi Swapna | నువ్ లేని రోజు ఇంత కష్టమొస్తదనుకోలే.. విగ్రహం తొలగిస్తే తట్టుకోలేకపోతున్నం
- ●CM Vijay | అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?
- ●Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల
- ●Kalwakuntla Kavitha | భూలక్ష్మి పథకంతో నిరుపేదలందరికీ ఎకరం భూమి.. మళ్లీ భూ పంపిణీ జరిగితేనే సామాజిక న్యాయం
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..

Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ - పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ - లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం

Peddi Swapna | నువ్ లేని రోజు ఇంత కష్టమొస్తదనుకోలే.. విగ్రహం తొలగిస్తే తట్టుకోలేకపోతున్నం

CM Vijay | అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?

Eatala Rajender | ప్రభుత్వమే విక్రయించిన భూములను 22ఏ జాబితాలో చేర్చడం దారుణం : ఎంపీ ఈటల






