త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అబ‌ద్ధాల‌తో హ‌రీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | ధరణి పేరుతో భూములు దోచుకొని... రాజకీయ ఉనికి కోసం అబద్ధాలతో హ‌రీశ్‌రావు డ్రామాలు ఆడుతున్నార‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిప‌డ్డారు.

S

Telangana | Published On Aug 18, 2026, 3.38 pm IST

Ponguleti Srinivas Reddy | అబ‌ద్ధాల‌తో హ‌రీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ధరణి పేరుతో భూములు దోచుకొని... రాజకీయ ఉనికి కోసం అబద్ధాలతో హ‌రీశ్‌రావు డ్రామాలు ఆడుతున్నార‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిప‌డ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పదేండ్ల పాటు భూములను విచ్చలవిడిగా దోచుకొని, వేల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ ముఠా.. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో భయాందోళనలు సృష్టించే కొత్త నాటకాలకు తెరలేపి, నీచ రాజకీయాలకు దిగజారింది అని విమ‌ర్శించారు.

ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం అని మంత్రి స్ప‌ష్టం చేశారు. 22A కారణంగా ప్రభావితమైన భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పదేండ్లలో చేసిన పాపాలు, పాల పేరుతో చేసిన చీకటి వ్యాపారాలు... అన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు అగ్గిపెట్టె రావు. త‌ప్పుడు ప్రచారాలతో ప్రభుత్వంపై బురదజల్లితే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని అనుకుంటే పొరపాటే. అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న అగ్గిపెట్టె రావు కల ఎప్పటికీ పగటికలగానే మిగిలిపోవడం ఖాయం అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Advertisement
Advertisement