Taapsee | తల్లి పాత్రలో తాప్సీ – గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్
ఢిల్లీ బ్యూటీ తాప్సీ గాంధారి పేరుతో బాలీవుడ్‌లో రివేంజ్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో తల్లి పాత్రలో తాప్సీ కనిపించబోతుంది. కమర్షియల్ సినిమాలు అవకాశాలు రాకపోవడంతోనే తాప్సీ తల్లి పాత్రల్లో కనిపిస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ రూమర్లపై తాప్సీ క్లారిటీ ఇచ్చింది.
Entertainment | Published On Aug 18, 2026, 3.27 pm IST
Taapsee | తాప్సీ కమర్షియల్ సినిమాలకు దూరమై చాలా కాలమైంది. గత కొన్నేళ్లుగా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తోంది. ప్రస్తుతం గాంధారి పేరుతో యాక్షన్ రివేంజ్ డ్రామా మూవీ చేస్తోంది తాప్సీ. ఈ సినిమాలో తల్లి పాత్రలో ఈ ఢిల్లీ బ్యూటీ కనిపించనుండటంపై విమర్శలు వస్తున్నాయి. కమర్షియల్ సినిమాలు అవకాశాలు రాకపోవడంతోనే తాప్సీ తల్లి పాత్రల్లో కనిపిస్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తాప్సీ చీఫ్ గెస్ట్‌గా హాజరైంది.ఈ వేడుకలో తనపై వస్తోన్న విమర్శలపై బదులిచ్చింది. హీరోయిన్లు అంటే అందంగానే కనిపించాలనే రూలు లేదంటూ కామెంట్లు చేసింది.
సమాజ ధోరణులకు భిన్నంగా...
"ఇండస్ట్రీ ఏదైనా, దర్శకులు ఎవరైనా తమ సినిమాల్లో హీరోయిన్లను అందంగా చూపించడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. పద్దతిగానే కథానాయికల పాత్రలను ఆవిష్కరిస్తుంటారు. సమాజ ధోరణులకు భిన్నంగా హీరోయిన్ల పాత్రలను రాయడానికి భయపడుతుంటారు. ఈ స్టీరియో టైప్‌ను బ్రేక్ చేయాలన్నదే నా సిద్ధాంతం. కెరీర్ ఆరంభంలో నాకు అలాంటి డిఫరెంట్ రోల్స్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టే వెరైటీ రోల్స్ చేస్తున్నా. పాత్రల పరంగా రిస్క్‌లు తీసుకుంటున్నా" అని తాప్సీ అన్నది.
ఇష్టానికి వ్యతిరేకంగా...
"మహిళలు తప్పులు చేస్తుంటారు. వారిలో కొన్ని లోపాలు ఉంటాయి. తమకు నచ్చినట్లుగా జీవించాలనే ఆలోచనలు ఉన్నా సామాజిక కట్టుబాట్ల కారణంగా ఇష్టానికి వ్యతిరేకంగా బతుకుతుంటారు. అలాంటి వారి జీవితాలను నిజాయితీగా స్క్రీన్‌పై చూపించే సినిమాలు రావాలని చెప్పడం కంటే నేనే చేస్తే బాగుంటుందని అనుకున్నా. అందుకే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్నా" అని చెప్పింది.
గాంధారి మూవీ షూటింగ్ పూర్తయ్యింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాను రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ నిర్మిస్తోంది. ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దేవాశిష్ మాకిజా దర్శకత్వం వహిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollywood | వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరో మూవీ – మలయాళ బ్యూటీతో రొమాన్స్
ఆగస్టు 16, 2026

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Tamannaah | హారర్ మూవీ షూటింగ్లో భయపడ్డ మిల్కీ బ్యూటీ – ఇన్‌స్టా పోస్ట్ వైరల్
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
- ●Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
- ●Defence Manufacturing | రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు.. కీలక ఉత్పత్తులు సొంతంగా తయారీ..
- ●Tiger | పట్ట పగలు.. గుర్రాన్ని చంపిన పెద్ద పులి.. వీడియో
- ●Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ - పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ - లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం
- ●Peddi Swapna | నువ్ లేని రోజు ఇంత కష్టమొస్తదనుకోలే.. విగ్రహం తొలగిస్తే తట్టుకోలేకపోతున్నం

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..

Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు

Defence Manufacturing | రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు.. కీలక ఉత్పత్తులు సొంతంగా తయారీ..

Tiger | పట్ట పగలు.. గుర్రాన్ని చంపిన పెద్ద పులి.. వీడియో



