TGSRTC | టీజీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఐటీ)గా రాజశేఖర్
TGSRTC | టీజీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ,పీ,ఎఏం & లీగల్) గా సీనియర్ అధికారి ఎం. రాజశేఖర్ బుధవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
TGSRTC | త్రినేత్ర.న్యూస్ : టీజీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ,పీ,ఎఏం & లీగల్) గా సీనియర్ అధికారి ఎం. రాజశేఖర్ బుధవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఈడీకి సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ ఐటీ (IT) విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రయాణికులకు టికెట్ బుకింగ్, లైవ్ బస్ ట్రాకింగ్ వంటి డిజిటల్ సేవలను మరింత సులభతరంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఐటీ విభాగంతో పాటు పర్సనల్, అస్సెట్ మేనేజ్‌మెంట్, లీగల్ విభాగాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సంస్థ ఆదాయ వనరులను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, అంతర్గత పరిపాలనను వేగవంతం చేస్తామని, అలాగే సంస్థకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను సకాలంలో పరిష్కరించి ఆర్టీసీ ప్రయోజనాలను కాపాడుతామని ఆయన పేర్కొన్నారు.
యాజమాన్యం, అధికారులు మరియు కార్మికులను సమన్వయం చేసుకుంటూ టీజీఎస్ ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సామూహికంగా కృషి చేస్తామని ఈడీ రాజశేఖర్ తెలిపారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? మమతా బెనర్జీకి కీలక ప్రతిపాదన చేసిన సోనియా గాంధీ
- ●Meta And Reliance | మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్నగర్లో 168 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు..
- ●Mock Assembly | అసెంబ్లీ సమావేశాలను తలపించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ
- ●Armys Helicopter Crashes | పీవోకేలో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది భద్రతా సిబ్బంది మృతి
- ●Telangana | ఘనా పారిశ్రామికాభివృద్ధికి ‘తెలంగాణ’ మార్గనిర్దేశం

CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? మమతా బెనర్జీకి కీలక ప్రతిపాదన చేసిన సోనియా గాంధీ

Meta And Reliance | మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్నగర్లో 168 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు..

Mock Assembly | అసెంబ్లీ సమావేశాలను తలపించిన టీనేజ్ బాలికల రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ




