త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayesh Ranjan | తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?

Jayesh Ranjan | తెలంగాణ ప్ర‌భుత్వ నూత‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌యేష్ రంజ‌న్ నియామ‌కం కానున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, జీహెచ్ఎంసీ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

S

Telangana | Published On Feb 18, 2026, 4.41 pm IST

Jayesh Ranjan | తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?
Advertisement

మార్చి 31తో ముగియ‌నున్న ప్ర‌స్తుత సీఎస్ ప‌ద‌వీకాలం
ఆ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ..
త‌దుప‌రి సీఎస్‌గా జ‌యేష్ రంజ‌న్ పేరు ఖ‌రారు

Jayesh Ranjan | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వ నూత‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌యేష్ రంజ‌న్ నియామ‌కం కానున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, జీహెచ్ఎంసీ స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని పట్టణ పాలనతో పాటు.. యువజన పురోగతి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, క్రీడల శాఖ, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది మార్చి 31తో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ముగియ‌నుంది. వాస్తవానికి ఆయన 2025 ఆగస్టు 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడు నెలల పాటు అంటే ఈ ఏడాది మార్చి 31 వరకూ పొడిగించింది. ఆ గడువు ముగుస్తుండటంతో, తదుపరి సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ పేరు దాదాపు ఖరారైనట్లు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ కొన‌సాగుతోంది.

1992 బ్యాచ్‌కు చెందిన జయేష్ రంజన్ ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి కావడమే కాకుండా సివిల్ సర్వీసెస్ టాపర్‌గా కూడా గుర్తింపు పొందారు. 2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలోనూ, ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. వివాదరహితుడైన అధికారిగా పేరుండటం, పాలనలో కొనసాగింపు ఉండాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, మార్చి నెలాఖరులో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

జయేష్ రంజన్ కంటే సీనియర్లు శశాంక్ గోయల్, అరవింద్ కుమార్ ఉన్నారు. అరవింద్ కుమార్‌పై ఫార్ములా ఈ రేసు కేసు ఉంది. దాంతో ఆయన పేరు పరిశీలనలోకి తీసుకునే అవకాశం లేదు. మరో సీనియర్ అధికారి వికాస్ రాజ్ కూడా రేసులో ఉన్నారు. అయితే ప్రభుత్వ పెద్దలకు అన్నీ తానై వ్యవహిరంచే జయేష్ రంజన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement