Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?
Jayesh Ranjan | ఐఏఎస్ అధికారి (IAS officer) జయేష్ రంజన్ (Jayesh Ranjan) స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జయేష్ 2027 సెప్టెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే దాదాపు పది నెలల ముందే తన సర్వీసుకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయన దరఖాస్తును కేంద్రానికి పంపినట్లుగా తెలుస్తోంది.
- రేవంత్ సర్కార్‌కు మరో సీనియర్ ఐఏఎస్ గుడ్ బై.!
Jayesh Ranjan | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ బ్యూరోక్రసీలో పెను సంచలనం చోటు చేసుకుంది. రేవంత్ సర్కార్ నుంచి మరో సీనియర్ ఐఏఎస్ అధికారి త్వరలోనే వైదొలగనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐఏఎస్ అధికారి ఎస్.ఎ.ఎం. రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) చేసి ప్రైవేటు రంగానికి వెళ్లగా.. ఇప్పుడు అదే దారిలో సీనియర్ అధికారి జయేష్ రంజన్ (Jayesh Ranjan) కూడా ప్రయాణించబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
జయేష్ రంజన్‌కు అమెరికాకు చెందిన ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఉన్నత స్థాయి బాధ్యతలు దక్కినట్లు సమాచారం. ఈ ఆఫర్ నేపథ్యంలోనే ఆయన వీఆర్ఎస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జయేష్ 2027 సెప్టెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ.. దాదాపు పది నెలల ముందే తన సర్వీసుకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయన దరఖాస్తును కేంద్రానికి పంపినట్లుగా తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కీలక శాఖల నుంచి బదిలీలు జరగడం, ఆపై ఈ సీనియర్ ఐఏఎస్ ఇప్పుడు ప్రైవేటు బాట పట్టడం రాజకీయ, సచివాలయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. రిజ్వీ దారిలోనే జయేష్ రంజన్ కూడా ప్రభుత్వ సర్వీసులకు స్వస్తి చెప్పి ప్రైవేటు రంగానికి వెళ్తారా..? లేదా సర్కార్ ఒత్తిళ్లకు తలొగ్గి సర్వీసులోనే కొనసాగుతారా..? అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తదుపరి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.
Also Read..
క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
- ●Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..
- ●Jailbreak | ఫిట్స్ నాటకం.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్
- ●Sirimanotsavam | నేడే సిరిమాను సంబరం.. భక్తిపారవశ్యంలో విజయనగరం!
- ●Microsoft | మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్

Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి

Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..

Jailbreak | ఫిట్స్ నాటకం.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్






