త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియ‌ర్ అకౌంటెంట్

ACB Raids | రాష్ట్రంలో ఏదో ఒక చోట అవినీతి చేప‌లు ఏసీబీ వ‌ల‌కు చిక్కుతున్నాయి. తాజాగా నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట ట్రెజ‌రీ కార్యాల‌యంలో సీనియ‌ర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కందాడ వెంక‌ట‌య్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు.

S

Telangana | Published On Oct 6, 2026, 5.52 pm IST

ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియ‌ర్ అకౌంటెంట్
Advertisement

ACB Raids | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో ఏదో ఒక చోట అవినీతి చేప‌లు ఏసీబీ వ‌ల‌కు చిక్కుతున్నాయి. తాజాగా నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట ట్రెజ‌రీ కార్యాల‌యంలో సీనియ‌ర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కందాడ వెంక‌ట‌య్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఫిర్యాదుదారుడు మెడికల్ లీవ్‌పై వెళ్లి తిరిగి విధుల్లో చేరిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మెడిక‌ల్ లీవ్ బిల్లులు, జీత‌భత్యాల ప్రక్రియను పూర్తి చేసేందుకు వెంకటయ్య రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో తొలుత ఆగ‌స్టు 14న‌ రూ. 3 వేలు ఫిర్యాదుదారుడు పుచ్చుకున్నారు. మిగిలిన రూ. 22 వేల‌ను అదే నెల 18న ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఈ వ్య‌వ‌హారంపై బాధిత వ్య‌క్తి ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచార‌ణ చేశారు. అవినీతికి పాల్ప‌డ్డ సీనియ‌ర్ అకౌంటెంట్‌ను నాంప‌ల్లి ఏసీబీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా, రిమాండ్ విధించింది.

Advertisement
Advertisement