త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | రేపు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. రూ. 450 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

CM Revanth Reddy | ఈ నెల 26న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రూ. 450 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

S

Telangana | Published On Nov 25, 2026, 5.47 pm IST

CM Revanth Reddy | రేపు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. రూ. 450 కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 26న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రూ. 450 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

సీఎం షెడ్యూల్ ఇలా..

  • గురువారం మధ్యాహ్నం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటుకు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
  • అనంతరం హెలికాప్ట‌ర్‌లో అచ్చంపేటకు చేరుకోనున్న రేవంత్.
  • అచ్చంపేటలో హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగసభా ప్రాంగణానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.
  • బహిరంగ సభ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
  • రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ వేదికగా ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్న సీఎం.
  • అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ముఖ్యమంత్రి.

శంకుస్థాప‌న‌ల వివ‌రాలు ఇవే..

మద్దిమడుగులో…

  • రూ.15 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ ఏర్పాటుకు శంకుస్థాపన.
  • రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన.
  • రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

అచ్చంపేట బహిరంగ సభ ప్రాంగణంలో..

  • రూ.274.32 కోట్లతో నాగర్ కర్నూల్ జిల్లాలో బీటీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన.
  • రూ.29.65 కోట్లతో నాగర్‌క‌ర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన.
  • రూ.25 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
  • రూ.18.105 కోట్లతో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన.
  • రూ.14 కోట్లతో అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో నూతన ITDA భవన నిర్మాణానికి శంకుస్థాపన.
  • రూ.2 కోట్లతో అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన.
Advertisement
Advertisement