త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేసీఆర్.. జనంలోకి ఎప్పుడొస్తవ్

CM Revanth Reddy | "కేసీఆర్ ప్రజల్లోకి రాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడడు. పాలమూరు ప్రాంతం వెనకబాటుకు ఆయనే కారణం. నేను నిఖార్సైన పాలమూరు బిడ్డను. నేను వాళ్లలాగా ద్రోహం చేయను. ఈ ప్రాంతంలో కృష్ణా జలాలను పారించి రుణం తీర్చుకుంటా. మీ బిడ్డగా నా ప్రాంతాన్ని సర్వం ఒడ్డి అభివృద్ధి చేస్తా. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Nov 26, 2026, 8.08 pm IST

CM Revanth Reddy | కేసీఆర్.. జనంలోకి ఎప్పుడొస్తవ్
Advertisement

ప్రజల్లోకి రావు.. అసెంబ్లీలో మాట్లాడవు
34 నెలల్లో 300 మంది పోలీసుల రక్షణతో
2 కోట్ల జీతభత్యాలు తీసుకున్నవ్ కదా
పాలమూరు వెనకబాటుకు కారణం నువ్వే
ఈ ప్రాంతాన్ని ఎండబెట్టింది నువ్వే
ఏమిచ్చిండని ఆయన మళ్లీ అధికారంలోకి రావాలె
నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను
నేను మీలాగా ద్రోహిని కాను
కేసీఆర్ బాగోతం అసెంబ్లీలో బయటపెడతాం
కాంగ్రెస్ సంక్షేమ పథకాల వల్లే
తెలంగాణ రైతులు బాగుపడుతున్నరు
కోటి మంది ఆడబిడ్డలకు చీరలు
అచ్చంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : "కేసీఆర్ ప్రజల్లోకి రాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడడు. పాలమూరు ప్రాంతం వెనకబాటుకు ఆయనే కారణం. నేను నిఖార్సైన పాలమూరు బిడ్డను. నేను వాళ్లలాగా ద్రోహం చేయను. ఈ ప్రాంతంలో కృష్ణా జలాలను పారించి రుణం తీర్చుకుంటా. మీ బిడ్డగా నా ప్రాంతాన్ని సర్వం ఒడ్డి అభివృద్ధి చేస్తా. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

గురువారం (నవంబరు 26) నాడు ఆయన మద్దిమడుగు, అచ్చంపేటలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, బాలు నాయక్, మురళీనాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లతో ఆయన మద్దిమడుగులో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. శ్రీ ప‌బ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు, హరిత హోటల్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అచ్చంపేటలో 379.07 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

కేసీఆర్..ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ పాలమూరుపై పగపట్టి ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందువల్లే ఈ ప్రాంతం ఇంకా ఎడారిగా ఉందని చెప్పారు. " పాలమూరు రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ పూర్తి అయి ఉంటే.. మీ బతుకులు బాగుపడేవి. మా బతుకులు ఎడారి కావడానికి కారణం నువ్వే. ముఖం చెల్లక.. ఫామ్ హౌస్‌లో ఎత్తిపోతల పథకంలో ఉన్నడు. 34 నెలల్లో 300 మంది పోలీసులతో రక్షణ తీసుకొని 2 కోట్ల రూపాయల జీతభత్యాలు తీసుకున్నడు. ప్రజల్లోకి రాడు..అసెంబ్లీలో మాట్లాడడు. ఆయనను ఎట్లా శిక్షించాలె? నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా కేసీఆర్‌కు అప్పజెబితే ఆయన పదేండ్లల్లో 8.11 లక్షల కోట్లు దివాలా తీయించిండు. రూపాయి పుట్టకుండా చేసిండు. కృష్ణా నీళ్లన్నీ ఆంధ్రకు అప్పజెప్పి తెలంగాణను ముంచిండు" అని తీవ్రంగా దుయ్యబట్టారు

34 నెలల్లో ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు

రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ తమ ప్రభుత్వం రైతుల రుణం తీర్చుకుంటున్నదని సీఎం అన్నారు. తాను ఈ 34 నెలల్లో ఏ ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా నిత్యం ప్రజల కోసమే శ్రమిస్తున్నట్టు చెప్పారు. "వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ అంటే.. మేం వరి పంట పండించేలా రైతులను ప్రోత్సహించి చివరి గింజ వరకు కొన్నాం. గత మూడేండ్లుగా దేశంలో అత్యధికంగా వడ్లు పండించింది తెలంగాణనే. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినం. రైతు భరోసా పేరుతో 36వేల కోట్లు మీ ఖాతాలో వేసినం. 90 వేల కోట్లు చెల్లించి మీ వడ్లు కొన్నం. రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎకరాకు 10వేల నష్టపరిహారం ఇస్తున్నాం. ఉచిత కరెంటు, ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాం. 1,78,000 కోట్లు రైతుల కోసం ఖర్చు పెడుతున్నం. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నాం" అని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement