Self Enumeration | ప్రారంభమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్.. రాష్ట్రంలో తొలిసారి జనగణన
Self Enumeration | రాష్ట్రంలో జనగణన (Census) ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా స్వీయగణన (Self Enumeration) చేపడుతున్న అధికారులు.. దీనికోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ https://se.census.gov.in ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది.
Self Enumeration | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో జనగణన (Census) ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా స్వీయగణన (Self Enumeration) చేపడుతున్న అధికారులు.. దీనికోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ https://se.census.gov.in ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు ఇవే మొదటిసారి కావడం గమనార్హం. కాగా, సెల్ఫ్ ఎన్యూమరేషన్ తప్పనిసరికాదని, ఇదొక ఆప్షన్ మాత్రమేనని అధికారులు వెల్లడించారు. దేశంలో ఎక్కడ ఉన్నా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చన్నారు. మే10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు వరకు ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇందులో 33 ప్రశ్నలు ఉంటాయి. దీని తర్వాత రెండో దశలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు మిగితా 6 ప్రశ్నలకు వివరాలు చెప్పాల్సి ఉంటుంది.
స్వీయగణన 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది. తొలివిడతలో ఇండ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. మే 11 నుంచి జూన్ 19 వరకు నివాసాలపై మార్కింగ్ చేస్తారు. జనగణన కోసం 1855 నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ సేవలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటాయి.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇలా..
స్టెప్ 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.in లింక్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: Self Enumeration (HLO) Login వద్ద మీ రాష్ట్రాన్ని (ఉదాహరణకు: తెలంగాణ) ఎంపిక చేసి, స్క్రీన్ పై కనిపించే Captcha కోడ్‌ను ఎంటర్ చేసి 'Verify & Proceed' పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆ తర్వాత వచ్చే Welcome పేజీలో మీ కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయండి.
స్టెప్ 4: ఇక్కడ మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి 'Verify & Proceed' క్లిక్ చేయండి. (గమనిక: ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి). అనంతరం మీకు నచ్చిన భాషను (తెలుగు/ఇంగ్లీష్ తదితర) ఎంచుకోండి.
స్టెప్ 5: తర్వాత మీ జిల్లా, పట్టణం లేదా గ్రామం, పిన్ కోడ్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 6: మీ మొబైల్‌లో Location సర్వీస్‌ను ON చేసి, మ్యాప్‌లో మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ (Red Mark) సెట్ చేయండి.
స్టెప్ 7: ఇప్పుడు ఇళ్ల వివరాలకు సంబంధించి మీ స్క్రీన్ పై 33 ప్రశ్నలు కనిపిస్తాయి. వీటికి సరైన సమాధానాలు ఇచ్చి, Preview ద్వారా మొత్తం వివరాలను ఒకసారి చెక్ చేసుకుని 'Submit' చేయండి.
స్టెప్ 8: Submit చేసిన తర్వాత 'H' తో ప్రారంభమయ్యే 11 అంకెల ప్రత్యేక SE ID నంబర్ వస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దాన్ని వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకోవడం లేదా ఎక్కడైనా రాసి భద్రపరచుకోవడం మర్చిపోకండి.
స్టెప్ 9: మే 11వ తేదీ తర్వాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి (Enumerator) మీరు భద్రపరచుకున్న ఈ 'SE ID' చూపిస్తే సరిపోతుంది. వారు దాని ఆధారంగా మీ వివరాలను అప్రూవ్ (Approve) చేస్తారు.

- ప్రతి కుటుంబానికి కేవలం ఒకే మొబైల్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి.
- నమోదు చేసేటప్పుడు తొందరపడకుండా, సరైన, కచ్చితమైన వివరాలను మాత్రమే నమోదు చేయాలి.
సరైన లెక్కలు - అభివృద్ధికి తొలి అడుగు కాబట్టి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను సకాలంలో నమోదు చేసి దేశ ప్రగతిలో భాగస్వాములు అవుదాం. ఏప్రిల్ 26న పోర్టల్ ఓపెన్ కాగానే మీ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



