Minister Seethakka | నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క కీలక విజ్ఞప్తి
Minister Seethakka | నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” (Inclusive Cities for Women and Girls) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను (Mulugu district) ఎంపిక చేసింది.
Minister Seethakka | నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” (Inclusive Cities for Women and Girls) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను (Mulugu district) ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జెండర్-రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవిని శనివారం నాడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి సీతక్క చెప్పారు.
"మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ అభినందనీయం. తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి: మంత్రి సీతక్క విజ్ఞప్తి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'పాలనా' (Palna Scheme - మిషన్ శక్తి) పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క కోరారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ. 5,500, హెల్పర్లకు రూ. 3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. ఇది వారు చేసే పనికి, బాధ్యతకు ఏమాత్రం సరిపోదని కేంద్రమంత్రికి వివరించారు. ఒక క్రెచ్‌లో దాదాపు 25 మంది పిల్లలు ఉంటారని, వారి సంరక్షణను చూసుకోవడం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని.. ప్రస్తుత జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ వేతనాలు చాలా తక్కువ అని పేర్కొన్నారు.
తక్కువ వేతనాల వల్ల నిపుణులైన సిబ్బందిని ఈ పథకంలో కొనసాగించడం కష్టమవుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది పరోక్షంగా శిశు సంరక్షణపై ప్రభావం చూపుతుందన్నారు. పనిచేసే తల్లులకు అండగా నిలిచే ఈ పథకం విజయవంతం కావాలంటే.. సిబ్బందికి ఇచ్చే వేతనాలను ప్రస్తుత వేతన ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
Also Read..
Harish Rao | హరీశ్‌రావును కలిసిన శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ సత్యానందేంద్ర సరస్వతి
India Flagged LPG Tankers | ఫలించిన దౌత్యం.. హర్మూజ్‌ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



