Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
Seetharama Lift | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో సుమారు రూ.610 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేల సమక్షంలో పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు.
Seetharama Lift | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో సుమారు రూ.610 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేల సమక్షంలో పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు. గొందిగూడెంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొన్నారు. సీతారామ మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తొలివిడతగా తుమ్మల చెరువు వరకు నీటిని తరలించి 4,300 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. దశలవారీగా అశ్వాపురం మండలంలో 22 వేల నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా పథకాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.
త్వరలో సీతారామ పనులు పూర్తి
సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, ప్రస్తుతం వాటిని ప్రాధాన్యతతో చేపట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేర్లు, డిజైన్ల మార్పుతో ప్రజాధనం వృథా అయిందని ఆయన ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు.
దొమ్మలవాగుకు నిధులు
బూర్గంపాడు ప్రాంతంలో సాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు దొమ్మలవాగు రిజర్వాయర్ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, త్వరలో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. రేకులగండి ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పులుసుబొంత ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, కలెక్టర్, సబ్ కలెక్టర్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
సెప్టెంబర్ 23, 2026

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
సెప్టెంబర్ 23, 2026

Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!
- ●Supreme Court | ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు
- ●Teenmar Mallanna BC Rajyadhikara Yatra | కొడంగల్‌లో అడుగుపెడతా.. రేవంత్ రెడ్డి భరతం పడతా

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!



