త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SCR Special Trains | రైల్వే ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. చ‌ర్ల‌ప‌ల్లి-కొల్లం మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లు..!

SCR Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి–కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. మొత్తం ఎనిమిది సర్వీసులు చొప్పున అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. చర్లపల్లి–కొల్లం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం. 07195) ప్రతి శుక్రవారం నడుస్తుంది.

P

Telangana | Published On Jul 20, 2026, 4.36 pm IST

SCR Special Trains | రైల్వే ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. చ‌ర్ల‌ప‌ల్లి-కొల్లం మ‌ధ్య స్పెష‌ల్ రైళ్లు..!
Advertisement

SCR Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి–కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. మొత్తం ఎనిమిది సర్వీసులు చొప్పున అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. చర్లపల్లి–కొల్లం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం. 07195) ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఈ రైలు ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్ 4న చర్లపల్లి నుంచి బయలుదేరి కొల్లం చేరుకుంటుంది. కొల్లం–చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం. 07196) ప్రతి శనివారం రాక‌పోక‌లు సాగిస్తుంది. ఈ రైలు ఆగస్టు 15, 22, 29, సెప్టెంబర్ 5న కొల్లం నుంచి బయలుదేరి చర్లపల్లికి చేరుకుంటుంది.

చర్లపల్లి–కొల్లం ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాల‌క్క‌డ్‌, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాశెరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలిక్కర, కాయంకుళం, కరుణాగపల్లి స్టేషన్లలో ఆగుతుంది. కొల్లం–చర్లపల్లి ప్రత్యేక రైలు కరుణాగపల్లి మినహా కాయంకుళం, మావేలిక్కర, చెంగన్నూర్, తిరువల్లా, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, అలువా, త్రిస్సూర్, పాల‌క్క‌డ్‌, పొదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వివ‌రించింది.

Advertisement
Advertisement