త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | సంక్రాంతికి ప్ర‌త్యేక రైళ్లు.. ఆరు స‌ర్వీసులు పొడిగింపు..

Special Trains | క్రిస్మస్, సంక్రాంతి (Sankranti) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల అదనపు రద్దీకి అనుగుణంగా ఆరు వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను (Special Trains) పొడిగించింది.

G

Telangana | Published On Nov 15, 2026, 12.54 pm IST

Special Trains | సంక్రాంతికి ప్ర‌త్యేక రైళ్లు.. ఆరు స‌ర్వీసులు పొడిగింపు..
Advertisement

Special Trains | త్రినేత్ర న్యూస్‌: క్రిస్మస్, సంక్రాంతి (Sankranti) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల అదనపు రద్దీకి అనుగుణంగా ఆరు వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను (Special Trains) పొడిగించింది. ఇందులో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి-కాకినాడ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. డిసెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి మొదటి వారం వరకు ఈ ప్ర‌త్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల‌ని, అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్లు (రైలు నం. 07425): ప్రతి ఆదివారం నడిచే ఈ రైలును డిసెంబర్ 6 నుంచి 2027 జనవరి 31 వరకు పొడిగించారు. మొత్తం 9 స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి.

శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ (రైలు నం. 07426): ప్రతి సోమవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 7 నుంచి 2027 ఫిబ్రవరి 1 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో ఒక్కొక్కటి 9 ట్రిప్పుల చొప్పున నడుస్తాయి.

చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (రైలు నం. 07037 07038): ప్రతి మంగళవారం నడిచే ఈ రైలు సర్వీసులను డిసెంబర్ 1 నుంచి జనవరి 26, 2027 వరకు పొడిగించారు. మొత్తం 9 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రతి బుధవారం నడిచే శ్రీకాకులం-చ‌ర్ల‌ప‌ల్లి స‌ర్వీసు డిసెంబర్ 2 నుంచి 2027 జనవరి 27 వరకు రాకపోకలు సాగిస్తుంది. ఇవి కూడా 9 సర్వీసుల చొప్పున నడుస్తాయి.

చర్లపల్లి-కాకినాడ-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (రైలు నం. 07039 07040): ప్రతి గురువారం నడిచే ఈ ప్రత్యేక రైలును డిసెంబర్ 3 నుంచి 2027 జనవరి 28 వరకు పొడిగించారు. తిరుగు ప్ర‌యాణంలో ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 4 నుంచి 2027 జనవరి 29 వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ మార్గంలోనూ 9 సర్వీసుల చొప్పున నడపనున్నారు.

Advertisement
Advertisement