త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lakshya Sen | జపాన్ మాస్టర్స్‌ విజేతగా లక్ష్యసేన్‌.. వరుసగా రెండో టైటిల్‌!

Lakshya Sen | భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ మరోసారి అదరగొట్టాడు. జపాన్‌ మాస్టర్స్‌ 2026 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ లక్ష్యసేన్‌ 13-21, 21-18, 21-14తో జపాన్‌ ఆటగాడు కోకి వటనాబేపై విజయం సాధించాడు.

P

Sports | Published On Nov 15, 2026, 11.17 am IST

Lakshya Sen | జపాన్ మాస్టర్స్‌ విజేతగా లక్ష్యసేన్‌.. వరుసగా రెండో టైటిల్‌!
Advertisement

Lakshya Sen | భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ మరోసారి అదరగొట్టాడు. జపాన్‌ మాస్టర్స్‌ 2026 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ లక్ష్యసేన్‌ 13-21, 21-18, 21-14తో జపాన్‌ ఆటగాడు కోకి వటనాబేపై విజయం సాధించాడు. 1.04 గంట‌ల పాట‌లు పోరులో తొలి గేమ్‌ కోల్పోయినా.. అద్భుతంగా పుంజుకుని టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో వరుసగా రెండో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు హైలో ఓపెన్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

తొలి గేమ్‌ కోల్పోయినా..

సొంతగడ్డపై ఆడుతున్న వటనాబే తొలి గేమ్‌ను 21-13తో గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్యసేన్‌ పుంజుకున్నాడు. ప్రత్యర్థికి గట్టిపోటీనిస్తూ 21-18తో గేమ్‌ నెగ్గి స్కోరును సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. వటనాబేకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచాడు. ఈ విజయంతో ఈ ఏడాది సింగపూర్‌ ఓపెన్‌, జపాన్‌ ఓపెన్‌లలో వటనాబే చేతిలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకున్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో లక్ష్యసేన్‌ 5-3తో ఆధిక్యంలో ఉన్నాడు.

ల‌క్ష్య‌సేన్ చ‌రిత‌..

2023లో ప్రారంభమైన కుమామోటో మాస్టర్స్‌ టైటిల్‌ గెలిచిన తొలి భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా లక్ష్యసేన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలతో టైటిల్‌ దక్కించుకున్నాడు. తొలి రౌండ్‌లో చైనీస్‌ తైపీ ఆటగాడు చి యు-జెన్‌ను, ఆ తర్వాత చైనా షట్లర్‌ డాంగ్‌ టియాన్యావోను ఓడించాడు. క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన యుషి తనకాపై, సెమీస్‌లో ఇండోనేసియా ఆటగాడు అల్వీ ఫర్హాన్‌పై విజయం సాధించాడు. ఫైనల్లో వటనాబేను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచాడు.

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌పై గురి

జపాన్‌ మాస్టర్స్‌ విజయంతో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ర్యాంకింగ్స్‌లో లక్ష్యసేన్‌కు 9,200 పాయింట్లు లభించాయి. టోర్నీకి ముందు 64,980 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్న అతడి ర్యాంకు మెరుగుపడనుంది. ఈ ఏడాది చివర్లో జరిగే హెచ్‌ఎస్‌బీసీ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించే దిశగా ఈ విజయం కీలకంగా మారింది. హైలో ఓపెన్‌, జపాన్‌ మాస్టర్స్‌ కలిపి వరుసగా ప‌ది మ్యాచ్‌ల్లో గెలిచిన లక్ష్యసేన్‌.. ఇదే జోరును కొనసాగించి టాప్‌-8లో చోటు దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.

Advertisement
Advertisement