త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ration | నేటి నుంచి న‌వంబ‌ర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ

Ration | మూడు నెలల విరామం తర్వాత మళ్లీ రేషన్‌ దుకాణాల్లో (Ration Shops) సన్నబియ్యం పంపిణీ ప్రారంభ‌మైంది. నవంబర్‌ నెల కోటాకు సంబంధించిన బియ్యాన్ని (Ration Rice) సోమవారం నుంచి రేష‌న్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు.

G

Telangana | Published On Nov 2, 2026, 9.39 am IST

Ration | నేటి నుంచి న‌వంబ‌ర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ
Advertisement

Ration | త్రినేత్ర న్యూస్‌: మూడు నెలల విరామం తర్వాత మళ్లీ రేషన్‌ దుకాణాల్లో (Ration Shops) సన్నబియ్యం పంపిణీ ప్రారంభ‌మైంది. నవంబర్‌ నెల కోటాకు సంబంధించిన బియ్యాన్ని (Ration Rice) సోమవారం నుంచి రేష‌న్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ఎల్‌నినో కార‌ణంగా ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా నెల వారీగా రేష‌న్ పంపిణీని తిరిగి ప్రారంభించింది. రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ఉచిత సన్న బియ్యం (Fine Rice) పంపిణీతో ప్రయోజనం పొందుతున్నారు. లబ్ధిదారులకు సకాలంలో బియ్యాన్ని అందించేందుకు వీలుగా మొత్తం 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే అన్ని చౌకధరల దుకాణాలకు పౌరసరఫరాల శాఖ అధికారులు తరలించారు.

బియ్యంతోపాటు నిత్యావ‌స‌రాలు..?

ఎల్‌నినో ప్ర‌భావంతో రాష్ట్రంలో కరువు ముంచుకొస్తున్న‌ది. దీనికితోడు నిత్యావ‌స‌రాల (Essential Commodities) ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పేద ప్రజలకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే సంక్రాంతి (Sankranti) పండుగ నాటికి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్న‌ది. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే అందుతున్నాయి.

కుటుంబంలోని ప్రతి సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పీడీఎస్ ద్వారా తొమ్మిది రకాల నిత్యావసరాలు అందించేవారు. ఇక 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా పేదలకు అందజేస్తామని చెబుతూ వస్తోంది. తాజా కరువు పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది.

ట్యాగ్స్:

El NinoEssential CommoditiesFine RicePDSRationRation ShopsSankrantiTelangana
Advertisement
Advertisement