Polytechnic Courses | పాలిటెక్నిక్‌లో 10 కొత్త కోర్సులు..! మొత్తం సీట్లు 18,300..!!
Polytechnic Courses | మీరు పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సులు చేయాలనుకుంటున్నారా..? ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు చేసి ఉన్నతంగా స్థిరపడాలనుకుంటున్నారా..? అయితే తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు మీలాంటి విద్యార్థుల కోసం సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది.
Polytechnic Courses | త్రినేత్ర.న్యూస్ : మీరు పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సులు చేయాలనుకుంటున్నారా..? ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు చేసి ఉన్నతంగా స్థిరపడాలనుకుంటున్నారా..? అయితే తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు మీలాంటి విద్యార్థుల కోసం సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ 10 కొత్త కోర్సులను ప్రవేశపెడుతుంది. ఈ కొత్త కోర్సుల వివరాలు తెలుసుకుందాం.
కొత్త కోర్సులు ఇవే..
సెమీ కండక్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, బయో టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్(బిల్డింగ్ సర్వీసెస్ ఇంజినీరింగ్), సివిల్ ఇంఇజీనిరింగ్, రియల్ ఎస్టేల్ అండ్ వాల్యూయేషన్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఇంటిరీయర్ డిజైన్ అండ్ ల్యాండ్‌స్కేప్ డిజైన్ వంటి కోర్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్యను పెంచడంతో పాటు.. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన కోర్సులను అందించాలనే ఉద్దేశంతోనే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు బోర్డు నిర్ణయించిందని బోర్డు సెక్రటరీ ఏ పుల్లయ్య పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
కొత్త కోర్సుల్లో సీట్లు 2280
కొత్త కోర్సుల్లో మొత్తం సీట్లు 2,280 ఉండగా.. ఇందులో సెమీకండక్టర్ టెక్నాలజీలో 720, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌లో 480, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో 240 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కోర్సులను మొదటగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనే ప్రవేశపెడుతామన్నారు.
మొత్తం సీట్లు - 18,300
2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 13,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరానికి కొత్తగా ప్రవేశపెట్టబోయే కోర్సుల్లో 2,880 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక మొత్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి మొత్తం 18,300 సీట్లు అందుబాటులోకి రానున్నాయని సెక్రటరీ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



