త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | కొత్త సీఎస్‌గా సంజ‌య్ జాజు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన స‌ర్కార్‌

CS Sanjay Jaju | తెలంగాణ ప్రభుత్వం కొత్త‌ సీఎస్‌గా సంజయ్‌ జాజు (Sanjay Jaju) నియామ‌కం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్ర‌వారం ఉత్తర్వులు వెలువ‌రించింది. ప్రస్తుతం సీఎస్‌గా ప‌ని చేస్తున్న‌ కె.రామకృష్ణారావు ఈనెల 30న‌ పదవీ కాలం ముగియ‌డంతో ఆయన స్థానంలో సంజయ్‌ జాజు నియ‌మితుల‌య్యారు.

S

Telangana | Published On Jun 26, 2026, 4.10 pm IST

CS Sanjay Jaju | కొత్త సీఎస్‌గా సంజ‌య్ జాజు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన స‌ర్కార్‌
Advertisement
  • ముఖ్యమంత్రి సలహాదారుగా కె.రామకృష్ణారావు

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ప్రభుత్వం కొత్త‌ సీఎస్‌గా సంజయ్‌ జాజు (Sanjay Jaju) నియామ‌కం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్ర‌వారం ఉత్తర్వులు వెలువ‌రించింది. ప్రస్తుతం సీఎస్‌గా ప‌ని చేస్తున్న‌ కె.రామకృష్ణారావు ఈనెల 30న‌ పదవీ కాలం ముగియ‌డంతో ఆయన స్థానంలో సంజయ్‌ జాజు నియ‌మితుల‌య్యారు. కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న సంజయ్‌ను తెలంగాణకు పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకొన్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రోవైపు ముఖ్యమంత్రి సలహాదారుడిగా కె.రామకృష్ణారావు నియామకమయ్యారు.

అయితే కొత్త ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంజయ్‌తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌రంజన్‌ పేరును కూడా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించి సంజయ్ వైపే మొగ్గు చూపారు. కాగా సంజ‌య్‌ 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా సేవ‌లందించారు. 2014 నుంచి ఆయ‌న‌ కేంద్ర సర్వీసులో కొన‌సాగుతున్నారు. 2029, ఫిబ్రవరి వరకు ఆయ‌న సర్వీసులో కొన‌సాగ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

G.O.912 - Appt. K.Ramakrishna Rao as Advisor

 

Advertisement
Advertisement