Sangameshwara Temple | కృష్ణానదికి పోటెత్తిన వరద.. సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసం.. ఫొటోలు
Sangameshwara Temple | కృష్ణానదికి (Krishna River) భారీగా వరద పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయం (Sangameshwara Temple) పూర్తిగా నీటమునిగింది. రెండు రోజుల క్రితమే ఆలయం కృష్ణమ ఒడికి చేరిన విషయం తెలిసిందే.
Sangameshwara Temple | త్రినేత్ర.న్యూస్: కృష్ణానదికి (Krishna River) భారీగా వరద పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయం (Sangameshwara Temple) పూర్తిగా నీటమునిగింది. రెండు రోజుల క్రితమే ఆలయం కృష్ణమ ఒడికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆలయం నీట మునిగినప్పటికీ శిఖరం బయటకు కనిపిస్తుండేది. కాగా, శ్రీశైలం ప్రాజెక్ట్‌కు (Srisailam Dam) జూరాల, తుంగభద్ర నుంచి పెద్ద మొత్తంలో వరద వస్తుండటంతో బుధవారం ఉదయం వరకు కనిపించిన ఆలయ శిఖరం.. 2 గంటల్లోనే పూర్తిగా నీటిలోకి వెళ్లిపోయింది. ఈనేపథ్యంలో బోటులో వెల్లిన వేద పండితులు ఆలయ శిఖరానికి చివరి పూజలు చేశారు. కాగా, శ్రీశైలంలో నీటిమట్టం పడిపోవడంతో ఈ ఏడాది మార్చిలో సంగమేశ్వర ఆలయం బయటపడింది. దీంతో ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు ప్రారంభించారు.

అయితే కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రవాహం ఆరంభం కావడంతో శ్రీశైలం క్రమంగా (Srisailam Back Water) నిండుతున్నది. ఈ క్రమంలో ఆగస్టు 1న ఆలయంలోకి నీరు చేరింది. ఈ నెల 3న ఆలయ శిఖరం వరకు మునిగిపోయింది. దీంతో గంగమ్మకు అర్చకులు చీర, సారె సమర్పించారు. ఇక మరో ఎనిమిది నెలలపాటు సంగమేశ్వరుడు కృష్ణమ్మ (Krishna River) ఒడిలోనే ఉండిపోనున్నారు. కాగా, గతేడాది జూన్ 15వ తేదీనే సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి నీరు ప్రవేశించగా.. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది సంగమేశ్వర స్వామి వారు 131 రోజుల పాటు పూజలు అందుకున్నారు.


సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..






