Sangameshwara Temple | 37 రోజుల్లోనే.. బయటపడిన సంగమేశ్వర ఆలయ శిఖరం
Sangameshwara Temple | ఏడాదిలో ఎనిమిది నెలలపాటు నీటిలో ఉంటూ కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కలిగించే సంగమేశ్వర ఆలయం (Sangameshwara Temple) కృష్ణమ్మ ఒడి నుంచి అప్పుడే బయటపడింది. కృష్ణానదిలో (Krishna River) నీటిమట్టం భారీగా తగ్గిపోవడంతో ఆలయ శిఖరం నీటిపైకి వచ్చింది.
Sangameshwara Temple | త్రినేత్ర.న్యూస్: ఏడాదిలో ఎనిమిది నెలలపాటు నీటిలో ఉంటూ కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కలిగించే సంగమేశ్వర ఆలయం (Sangameshwara Temple) కృష్ణమ్మ ఒడి నుంచి అప్పుడే బయటపడింది. కృష్ణానదిలో (Krishna River) నీటిమట్టం భారీగా తగ్గిపోవడంతో ఆలయ శిఖరం నీటిపైకి వచ్చింది. సప్తనదీ సంగమంలోని సంగమేశ్వర ఆలయం ఈ ఏడాది ఆగస్టు 5న పూర్తిగా జలాధివసం అయింది. అయితే ఆగస్టు 16 నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్ (Srisailam Back Water) క్రమంగా తగ్గుతుండటంతో 37 రోజుల్లోనే ఆలయం బయటపడింది.
శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత ఇంత తక్కువ వ్యవధిలోనే ఆలయం బయటపడటం ఇదే మొదటిసారని నదీతీర గ్రామాల ప్రజలు తెలిపారు. ఇలా జరగడం మంచిది కాదని, మళ్లీ వరదలు రావడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ గోపురంపై వినాయక చవితి రోజున గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అర్చకుడు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు.
ఎక్కువ రోజులు పూజలు అందుకున్నదీ ఈ ఏడాదే..
సాధారంగా మార్చి నెలలో సంగమేశ్వర ఆలయం కృష్ణా నది (Krishna Water) నుంచి బయటపడుతుంది. జూన్ నెలలో తిరిగి సప్తనదుల ఒడికి చేరుతుంది. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాదీ మార్చి 5న సంగమేశ్వరుడు గంగమ్మ ఒడి నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ఆగస్టు 5న ఆలయం పూర్తిగా నీటమునిగింది. అంటే ఈ ఏడాది సంగమేశ్వర స్వామి వారు 131 రోజుల పాటు పూజలు అందుకున్నారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరంభం కావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ (Srisailam) ఆగస్టు 1న ఆలయంలోకి చేరింది. అదే నెల 3న ఆలయ శిఖరం వరకు మునిగిపోయింది. ఆగస్టు 5న ఆలయ శిఖరం పూర్తిగా జలాధివసం అయిపోయింది. కాగా, గతేడాది జూన్ 15వ తేదీనే సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి నీరు ప్రవేశించింది.
సంబంధిత వార్తలు

Harish Rao | అసెంబ్లీ నుంచి మమ్మల్ని ఎత్తేయడం కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తు
సెప్టెంబర్ 10, 2026

KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
సెప్టెంబర్ 4, 2026

Niranjan Reddy | వరద జలాలే లక్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు
- ●Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!
- ●Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు

Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!

Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా



