త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KRMB | తాగు నీటి అవ‌స‌రాల‌కే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు

KRMB | వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

S

Telangana | Published On Sep 4, 2026, 9.46 pm IST

KRMB | తాగు నీటి అవ‌స‌రాల‌కే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
Advertisement

KRMB | త్రినేత్ర‌.న్యూస్ : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్ప‌త్తికి నీటిని వినియోగించ‌డం వెంట‌నే నిలిపివేయాల‌ని ఆదేశించింది. తాగునీటి అవ‌స‌రాల‌కు మాత్ర‌మే నీటిని వినియోగించాల‌ని ఇటు తెలంగాణ‌, అటు ఏపీని ఆదేశించింది కేఆర్ఎంబీ.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పునర్విభజన చట్టం- 2014 లోని 11వ షెడ్యూల్ లో 2, 3 పేరాలను అనుసరించి నీటి వినియోగం ఉండాలి అని సూచించింది. సాగు నీరు- త్రాగునీరు-విద్యుత్ ఉత్పత్తికి విరుద్ద పరిస్దితులు వస్తే, త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేఆర్ఎంబీ స్ప‌ష్టం చేసింది. తెలంగాణా రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం నీటిని వినియోగించడంపై కేఆర్ఎంబీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

Advertisement
Advertisement