Sama Ramnohan Reddy | రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుతున్నారు.. హరీశ్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం
Sama Ramnohan Reddy | రాష్ట్ర ప్రజలు సర్వనాశనం కావాలని హరీశ్ రావు (Harish Rao) తాంత్రిక, క్షుద్రపూజలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ramnohan Reddy) విమర్శించారు. తాము అధికారంలో లేము కాబట్టి రాష్ట్రం సర్వ నాశనం కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు.
Sama Ramnohan Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రజలు సర్వనాశనం కావాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) తాంత్రిక, క్షుద్రపూజలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ramnohan Reddy) విమర్శించారు. తాము అధికారంలో లేము కాబట్టి రాష్ట్రం సర్వ నాశనం కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. నేటి నుంచి హరీశ్ రావు పేరు తాంత్రిక హరీశ్ రావు అంటూ ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 2న తిరుచిరాపల్లిలో హరీశ్ రావు తాంత్రిక పూజలు చేశారన్నారు. మే 31 నుంచి జూన్ 1 వరకు శివమొగ్గలో క్షుద్రపూజలు చేశారని, జూన్ 20న తిరుచ్చిలో జయగోరి కాళీ పూజలు, జూలై 23న శివమొగ్గలో క్షుద్రపూజలు చేశారని ఆరోపించారు.
తాంత్రిక పూజలు ఎవరి కోసం..
తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం హరీశ్ రావుకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎవరి కోసం తాంత్రిక పూజలు చేస్తున్నాడన్నారు. ఎవరికి కీడు చేయాలని ఆ పూజలు చేస్తున్నారని, దీనిపై హరీశ్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కూడా హరీశ్ రావు పూజలపై సమాధానం చెప్పాలన్నారు. రైతులు ఏడ్వాలనే దురుద్దేశంతో పుల్లలు పెట్టాలని హరీశ్ రావు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాము ఉంటే రాష్ట్రం ఉండాలి, లేదంటే ఉండొద్దనేలా ప్రతి పక్ష నాయకుల వికృత చేష్టలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను, రైతులను, మహిళలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి చంపించిన హంతకులు వాళ్లని చెప్పారు. ప్రజలు వాళ్ల ట్రాప్‌లో పడొద్దని, ఇలాంటి దుర్మాగులను సామాజిక బహిష్కరణ చేయాలన్నారు.
వర్షాలు పడొద్దని మొక్కుతున్నారు..
వర్షాలు రావాలని పూజలు చేసే వాళ్లను చూశామని, కానీ రైతులు ఏడవాలని హరీశ్ రావు దరిద్రపు తాంత్రిక పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడొద్దని బీఆర్ఎస్ నేత ప్రకాశ్ స్వయంగా మీడియాలో మొక్కుకుంటున్నారని చెబుతూ వీడియో ప్లే చేసి చూపించారు. తెలంగాణను అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని తాంత్రిక పూజలు ఏమి చేయలేవన్నారు. దేవుడు మంచి చేసే వాళ్లతో ఉంటాడని, రైతులు, మహిళలు, యువకులు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని చెప్పారు.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల
ఆగస్టు 12, 2026

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
ఆగస్టు 12, 2026

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..
- ●E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
- ●CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
- ●Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు.. జూలైలో భారీ మార్పులు..
- ●Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ

N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..

E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి



