Bandi Sanjay | రేవంత్‌ను ఎదురించాల్సిందే.. బండి సంజయ్ పిలుపు
Bandi Sanjay | హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తూ.. ముస్లింలకు వత్తాసు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎదురించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇకనైనా హిందూ సమాజం జాగృతమై ప్రజా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని
దర్శించుకున్న బండి సంజయ్
హిందూ సమాజం జాగృతమై
ప్రజా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి
రంజాన్‌కు రూ. 33 కోట్లు
బోనాలకు రూ. 20 కోట్లా..?
రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేంద్ర మంత్రి
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తూ.. ముస్లింలకు వత్తాసు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎదురించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇకనైనా హిందూ సమాజం జాగృతమై ప్రజా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హిందూవులందరికి శుభాకాంక్షలు. ఇవాళ భక్తులంతా ఎండకు ఎండుతున్నరు.. వానకు తడుస్తున్నరు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. వాళ్లకు ఎందుకు ఇచ్చిర్రు.. మాకు ఎందుకు ఇవ్వలేదు అంటలేం. రూ. 33 కోట్లు రంజాన్ కోసం ప్రజా ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రతిపాదికన తీసుకుంటే 80 శాతానికి పైగా హిందూవులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూవులు బోనాల పండుగ చేసుకుంటున్నరు. కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లోనే 3,400 దేవాలయాల్లో బోనాల పండుగ నిర్వహించుకుంటున్నరు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఎంతంటే కేవలం రూ. 20 కోట్లు మాత్రమే. అంటే ఒక్కో దేవాలయానికి కనీసం రూ. 6 వేలు కేటాయించలేదు. ఇది ఎంత దారుణమైన విషయమో ఆలోచించాలి. కనీసం హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాడుకోలేని పరిస్థితి ఉంది. హిందూవుల పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో గమనించాలి అని బండి సంజయ్ సూచించారు.
హిందువులు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది
గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. రూ. 20 వేల కోట్లు దేనికి సరిపోతాయి. హిందువులు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తదో తెలియదు. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. మన వాటా మనకు రావాల్సిన అవసరం ఉన్నది. 80 శాతం జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలి. పిల్లలు, వృద్ధులు ఎండలో నిలబడ్డారు.. వాళ్ల కాళ్లు కాలుతున్నాయి. తాగడానికి కూడా నీళ్లు లేవు. కనీసం నీడ కోసం షెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. నాయకులు వచ్చారు.. దండం పెట్టుకుని వెళ్లిపోయారు. ఇది కాదు.. భక్తులకు ఏర్పాట్లు చేయాలి అని సంజయ్ సూచించారు.
కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్
కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. కేవలం వాళ్ల ఓట్లతోనే గెలిచారు వీళ్లు. అందుకే ఈరోజు హిందూవుల పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందూ సమాజం జాగృతమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎదురించాల్సిన అవసరం ఉందని చెబుతున్నానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
ఆగస్టు 11, 2026

Telangana Coal Mines | తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్: సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించండి
ఆగస్టు 11, 2026

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!
- ●Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు
- ●Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు
- ●Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు
- ●Dasoju Sravan Open Letter to CM | సీఎం రేవంత్.. ఇది ప్రకృతి కోపం కాదు, మీ చేతకానితనమే!

‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!

Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!

Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు

Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు



