Trading | ట్రేడింగ్‌ను వృత్తిగా స్వీకరిస్తున్నారా.. సెబీ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే..
Trading | స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ అంటే ఒకప్పుడు ఎంతో కష్టమైందిగా భావించేవారు. చాలా మందికి నష్టాలు రావడంతో అది పెద్ద జూదమని కూడా విశ్వసించేవారు. అందుకనే ఒకప్పుడు స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్లాలంటే చాలా మంది భయపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.
Trading | స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ అంటే ఒకప్పుడు ఎంతో కష్టమైందిగా భావించేవారు. చాలా మందికి నష్టాలు రావడంతో అది పెద్ద జూదమని కూడా విశ్వసించేవారు. అందుకనే ఒకప్పుడు స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్లాలంటే చాలా మంది భయపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు మారాయి. టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా ఇనిస్టిట్యూషనల్ (సంస్థాగత) ట్రేడర్ల వద్ద ఉండే ట్రేడింగ్ టూల్స్ అన్నీ సాధారణ రిటెయిల్ ట్రేడర్లకు కూడా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో చాలా మంది ట్రేడింగ్‌ను కూడా ఒక కెరీర్‌గా మార్చుకుంటున్నారు. వారంలో 5 రోజుల పాటు ట్రేడింగ్ ఉంటుంది కనుక ఆ రోజులు కష్టపడి వారాంతంలో 2 రోజులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ట్రేడర్లందరి లైఫ్ ఇలాగే ఉండడం లేదు. ముఖ్యంగా భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ) రిటెయిల్ ట్రేడర్ల ట్రేడింగ్‌పై పలు షాకింగ్ నిజాలను వెల్లడించింది. రిటెయిల్ ట్రేడర్లలో 100కు 93 శాతం మంది నష్టపోతున్నారని, కేవలం కొద్ది శాతం మంది మాత్రమే ఇందులో లాభాలను సంపాదిస్తున్నారని తెలిపింది.
93 శాతం మందికి నష్టాలు..
దేశంలోని రిటెయిల్ ట్రేడర్ల లాభ నష్టాలపై సెబీ ఇటీవల ఓ లోతైన అధ్యయనం నిర్వహించింది. ఇందులో షాకింగ్ గణాంకాలను తెలియజేసింది. ట్రేడింగ్‌ను వృత్తిగా మార్చుకోవాలని చూస్తున్న వారికి ఈ గణాంకాలు హెచ్చరిక లాంటివని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ చేస్తున్న ట్రేడర్లలో దాదాపు 90 నంచి 93 శాతం మంది నష్టపోతున్నారని సెబీ గణాంకాల్లో తేలింది. నష్టపోతున్న ప్రతి యాక్టివ్ ట్రేడర్ సగటున ఏడాదికి రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు కోల్పోతున్నారని పేర్కొంది. కేవలం 7 నుంచి 10 శాతం మంది రిటెయిల్ ట్రేడర్లు మాత్రమే మార్కెట్లలో లాభాలను గడిస్తున్నారని వెల్లడించింది. వీరిలో కేవలం 1.5 శాతం మంది మాత్రమే నెలకు రూ.1 లక్ష లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయాన్ని స్థిరంగా సంపాదిస్తున్నారని, మిగిలిన వారి సంపాదన తక్కువగానే ఉందని సెబీ తెలిపింది. ఇక ట్రేడర్లకు లాభం వచ్చినా లేదా నష్టాన్ని ఎదుర్కొన్నా వారు ఆ మొత్తాల్లో సుమారుగా 15 నుంచి 25 శాతం మేర కేవలం బ్రోకరేజ్, పన్నులు, ఇతర లావాదేవీల ఛార్జీలనే చెల్లిస్తున్నారని, ఇది కూడా అధిక మొత్తమేనని స్పష్టం చేసింది.
భయాందోళనలు, భావోద్వేగాల నియంత్రణ అవసరం..
ట్రేడింగ్‌లో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయని సెబీ పేర్కొంది. మార్కెట్ హెచ్చు తగ్గులు తీవ్రంగా ఉంటే లాభం లేదా నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సమయాల్లో భయం, ఆందోళన, దురాశ లేదా భావోద్వేగాలను నియంత్రించడం కష్టమని, వాటిని తట్టుకుంటేనే ట్రేడింగ్‌ను విజయవంతమైన కెరీర్‌గా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలియజేసింది. ట్రేడింగ్ ను కెరీర్‌గా మార్చుకోవాలంటే చాలా అంశాలపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి ట్రేడ్‌లోనూ పెట్టుబడి ఎంత, ఎంత రిస్క్ (స్టాప్ లాస్) తీసుకుంటున్నారు, ఏ మేర లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తదితర అన్ని వివరాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి. ఇదే సూత్రాన్ని కఠినంగా అనుసరించాలి. అలాగే క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్‌లు, టెక్నికల్ ఇండికేటర్లపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి.
ట్రేడింగ్ అంటే జూదం కాదు..
సాధారణంగా అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రేడింగ్‌ను ఒక జూదంగా చూడరు. వారు ట్రేడింగ్ అంటే ఒక గౌరవప్రదమైన, వ్యవస్థీకృతమైన వైట్ కాలర్ కెరీర్‌గా చూస్తారు. కానీ భారత్‌లో ట్రేడింగ్‌ను ఇప్పటికీ చాలా మంది జూదంలా అభివర్ణిస్తుంటారు. అయితే సరైన అవగాహన, పూర్తి స్థాయిలో మార్కెట్లపై పట్టు ఉంటే ట్రేడింగ్‌ను వృత్తిగా కొనసాగించేవారు నింపాదిగా అందులో రాణిస్తారు. కానీ చాలా మందికి ఆర్థిక అక్షరాస్యత ఉండడం లేదని, సరైన గైడెన్స్ లభించడం లేదని, అందువల్లే చాలా మంది ట్రేడర్లు నష్టాలను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సరైన అవగాహన ఉంటే ఇందులో ఎవరైనా రాణించే అవకాశాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
ఆగస్టు 13, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
ఆగస్టు 13, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'
- ●CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ
- ●CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
- ●TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని

Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'

CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?



