JioTag 2 | జియో కొత్త ట్రాకింగ్ డివైస్.. కేవలం రూ.1249 మాత్రమే..
JioTag 2 | రిలయన్స్ జియో తన కొత్త ట్రాకింగ్ డివైస్ జియోట్యాగ్ 2ను విడుదల చేసింది. 2023లో వచ్చిన తొలి జియోట్యాగ్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైస్ కీలు, వాలెట్, లగేజ్, బ్యాక్‌ప్యాక్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు వంటి వ్యక్తిగత వస్తువులను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.
Technology | Published On Aug 3, 2026, 12.59 pm IST
JioTag 2 | రిలయన్స్ జియో తన కొత్త ట్రాకింగ్ డివైస్ జియోట్యాగ్ 2ను విడుదల చేసింది. 2023లో వచ్చిన తొలి జియోట్యాగ్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైస్ కీలు, వాలెట్, లగేజ్, బ్యాక్‌ప్యాక్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు వంటి వ్యక్తిగత వస్తువులను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. మల్టీ ప్లాట్‌ఫామ్ ట్రాకర్‌గా రూపొందించిన ఈ డివైస్ ప్రధాన స్మార్ట్‌ఫోన్ ఎకోసిస్టమ్‌లతో నేరుగా అనుసంధానమై, పోయిన వస్తువులను గుర్తించడంలో సహాయపడుతుంది. జియోట్యాగ్ 2లో ప్రధాన ఆకర్షణ డ్యుయల్ ప్లాట్‌ఫామ్ కంపాటిబిలిటీ. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ పనిచేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్ వంటి యాపిల్ డివైస్‌లలో యాపిల్ ఫైండ్ మైతో, ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఫైండ్ హబ్‌తో నేటివ్‌గా కనెక్ట్ అవుతుంది. దీంతో ప్రత్యేక బ్రాండ్ యాప్‌పై ఆధారపడకుండా, ఫోన్‌లో ఇప్పటికే ఉన్న లొకేషన్ సర్వీసుల ద్వారానే ట్రాకర్‌ను ఉపయోగించుకోవచ్చు.
వస్తువులను గుర్తించే ఫీచర్లు..
జియోట్యాగ్ 2లో వస్తువులను సులభంగా గుర్తించేందుకు పలు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 120 డెసిబెల్స్ సామర్థ్యంతో కూడిన లౌడ్ బజర్‌ను అమర్చారు. యాప్‌లోని ప్లే సౌండ్ ఆప్షన్‌ను ఉపయోగించి సమీపంలో ఉన్న వస్తువును శబ్దం ద్వారా గుర్తించవచ్చు. బ్లూటూత్ లో ఎనర్జీ (బీఎల్ఈ) టెక్నాలజీ ద్వారా తక్కువ విద్యుత్ వినియోగంతో వేగవంతమైన, స్థిరమైన కనెక్టివిటీ లభిస్తుంది. బ్లూటూత్ పరిధిని దాటి వస్తువు వెళ్లిపోయినా కూడా జియోట్యాగ్ 2 పనిచేస్తుంది. యాపిల్ ఫైండ్ మై, గూగుల్ ఫైండ్ హబ్ నెట్‌వర్క్‌లలో భాగమైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌ల సహాయంతో ఆ వస్తువు ఉన్న ప్రాంతాన్ని సురక్షితంగా గుర్తించి యజమానికి సమాచారం అందిస్తుంది. ఈ డివైస్‌కు సిమ్ కార్డు లేదా మొబైల్ డేటా రీఛార్జ్ అవసరం ఉండదు. బీకనింగ్ ప్రోటోకాల్స్ ఆధారంగా పనిచేసే ఈ ట్రాకర్ ప్రపంచవ్యాప్తంగా అదనపు సెల్యులర్ ఖర్చులు లేకుండానే పనిచేస్తుంది.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా..
జియోట్యాగ్ 2కు ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు. మార్చుకునే బ్యాటరీతో ఇది ఒక సంవత్సరం వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. రిటైల్ బాక్స్‌లో అదనంగా మరో బ్యాటరీను కూడా అందిస్తున్నారు. తేలికైన, అల్ట్రా కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చిన ఈ డివైస్‌లో బిల్ట్ ఇన్ లూప్ ఉండటంతో కీచైన్‌కు తగిలించడం, సైకిల్‌కు అమర్చడం లేదా జిమ్ బ్యాగ్‌లో ఉంచడం సులభంగా ఉంటుంది. సాధారణ బ్లూటూత్ ట్రాకర్లు, జీపీఎస్ ట్రాకర్లతో పోలిస్తే జియోట్యాగ్ 2 మధ్యస్థ పరిష్కారంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్, ఆండ్రాయిడ్ నెట్‌వర్క్ మద్దతుతో పనిచేయడం దీని ప్రత్యేకత. అయితే ఇది పూర్తి స్థాయి రియల్‌టైమ్ జీపీఎస్ ట్రాకింగ్‌ను అందించదు. సిమ్ అవసరం లేకపోవడం, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, చిన్న పరిమాణం వంటి అంశాలు దీనిని ప్రత్యేకంగా మార్చాయి. జియోట్యాగ్ 2ను బ్లాక్, గ్రీన్, రెడ్ రంగుల్లో విడుదల చేశారు. దీని ధరను రూ.1,249గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Reliance Jio | జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..
ఆగస్టు 10, 2026

Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
ఆగస్టు 8, 2026

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
జులై 29, 2026
తాజావార్తలు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..



