Harish Rao | అసెంబ్లీ వద్ద తోపులాట.. హరీశ్ రావు, కేటీఆర్‌పై కేసు
Harish Rao | అసెంబ్లీ సమావేశాల (Assembly Session) తొలిరోజు చోటుచేసుకు తీవ్ర ఉద్రిక్తతలు, ఫర్షణల ఘటనలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పార్టీ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao), ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు (Sudheer Reddy) పలువురు ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ సమావేశాల (Assembly Session) తొలిరోజు చోటుచేసుకు తీవ్ర ఉద్రిక్తతలు, ఫర్షణల ఘటనలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పార్టీ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao), ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు (Sudheer Reddy) పలువురు ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడటం, విధులకు ఆటంకం కలిగించడం, అసభ్య పదజాలంతో దుర్భాషలాడారన్న (Abusive Language) ఆరోపణలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదుచేశారు. అసెంబ్లీ ప్రాంగణం, రోడ్లపై జరిగిన తోపులాట దృశ్యాలు, మీడియా కెమెరాలు, పోలీసుల బాడీ వార్న్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదుచేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు అసెంబ్లీ గేటువద్ద కలకలం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్త హేమచంద్రపై, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం బారికేడ్లను తోసుకుంటూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ (BJP) కార్యకర్త గణేశ్‌పై కూడా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం రచ్చరచ్చ జరిగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కూడిన నల్ల టీ షర్ట్ ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కేటీఆర్, అనిల్ జాదవ్ సహా పలువురు గాయపడ్డారు. పోలీసులు తన చీర లాగి అమర్యాదగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు. మరో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పోలీసులు తన జుట్టు పట్టిలాగారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్... సభకు దూరంగా ఉండటం వెనుక 6 కారణాలు
- ●Horoscope | సెప్టెంబర్ 8 రాశిఫలాలు.. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొంత శ్రమ అవసరం!
- ●Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష
- ●Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం

అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్... సభకు దూరంగా ఉండటం వెనుక 6 కారణాలు

Horoscope | సెప్టెంబర్ 8 రాశిఫలాలు.. కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొంత శ్రమ అవసరం!

Global Summit | ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించండి.. గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్





