త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | భ‌ర్త క‌ళ్లెదుటే.. రోడ్డు ప్ర‌మాదంలో న‌వ వ‌ధువు దుర్మ‌ర‌ణం

Road Accident | ఆ జంట‌కు వివాహ‌మై (Newlywed woman) రెండు నెల‌లు కూడా కాలేదు. అప్పుడు భ‌విష్య‌త్‌పై వారు క‌న్న క‌ల‌లు అడియాశ‌ల‌య్యాయి. ఆటో రూపంలో వ‌చ్చిన మృత్యువు ఇప్పుడిప్పుడే ప్రారంభ‌మ‌వుతున్న వారి ప్ర‌యాణానికి ముగింపు ప‌లికింది.

G

Hyderabad | Published On Oct 11, 2026, 9.26 am IST

Road Accident | భ‌ర్త క‌ళ్లెదుటే.. రోడ్డు ప్ర‌మాదంలో న‌వ వ‌ధువు దుర్మ‌ర‌ణం
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: ఆ జంట‌కు వివాహ‌మై (Newlywed woman) రెండు నెల‌లు కూడా కాలేదు. అప్పుడు భ‌విష్య‌త్‌పై వారు క‌న్న క‌ల‌లు అడియాశ‌ల‌య్యాయి. ఆటో రూపంలో వ‌చ్చిన మృత్యువు ఇప్పుడిప్పుడే ప్రారంభ‌మ‌వుతున్న వారి ప్ర‌యాణానికి ముగింపు ప‌లికింది. భ‌ర్త‌తో క‌లిసి బైక్‌పై వెళ్తున్న న‌వ వ‌ధువు రోడ్డు ప్ర‌మాదంలో (Road Accident) మ‌ర‌ణించిన ఘ‌ట‌న హైద‌రాబాద్ మ‌ల‌క్‌పేట‌లో చోటుచేసుకుంది.

ఎల్‌బీనగర్‌కు చెందిన శ్రీకాంత్‌కు ములుగు (Mulugu) జిల్లా కేంద్రానికి చెందిన లావణ్య (25)తో 41 రోజుల క్రితం వివాహమైంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం దంపతులు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. మలక్‌పేట (Malakpet) డీమార్ట్‌ సిగ్నల్‌ వద్దకు చేరుకుంటుండగా ఓ ఆటో వారి బైక్‌కు తగిలింది. అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదేస‌మ‌యంలో వ‌చ్చిన ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద లావణ్య పడిపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు లావణ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ద‌వాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అమలాపురానికి చెందిన కే.శ్రీనివాసరావు, జేఎన్‌టీ రావును అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్‌పైనా కేసు నమోదు చేశారు. తన కళ్లెదుటే భార్య మ‌ర‌ణించ‌డంతో భర్త కన్నీరుమున్నీరయ్యాడు.

Advertisement
Advertisement