Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. అందుబాటులో 65 ప్రత్యేక అంబులెన్స్‌లు
Khelo India Youth Games | రాష్ట్రంలో వచ్చే నెలలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్( Khelo India Youth Games ) 2026 జరగనున్నాయి. తెలంగాణలోని పలు క్రీడా మైదానాల్లో ఈ గేమ్స్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో క్రీడాకారులకు, ఇతరులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ( Health Department ) కూడా సిద్ధమైంది.
Khelo India Youth Games | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో వచ్చే నెలలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్( Khelo India Youth Games ) 2026 జరగనున్నాయి. తెలంగాణలోని పలు క్రీడా మైదానాల్లో ఈ గేమ్స్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో క్రీడాకారులకు, ఇతరులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ( Health Department ) కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ( Damodar Rajanarsimha ) ఆధ్వర్యంలో క్రీడా మైదానాల వద్ద తీసుకోవాల్సిన చర్యలు, వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల నిర్వహణపై శుక్రవారం చర్చించారు.
ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఎనిమిది జిల్లాల్లో 20 మైదానాల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రాంతాల్లో తక్షణ వైద్య సహాయం అందించేందుకు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మొత్తం 278 మంది ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. వైద్య సేవలందించేందుకు 10 ప్రభుత్వ ఆస్పత్రులను, 19 ప్రయివేటు ఆస్పత్రులను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు 1112 జనరల్ మెడిసిన్ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. వీరంతా రెండు షిఫ్ట్‌ల్లో పని చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మెడికల్ టీమ్‌లో 8 మంది మెడికల్ ఆఫీసర్లు, 14 మంది నర్సింగ్ ఆఫీసర్లు, ఐదుగురు ఫిజియోథెరపీస్టులు, ఇద్దరు ఏఎన్ఎంలు, నలుగురు ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండనున్నారు.
క్రీడాకారులు నివాసం ఉండే ప్రాంతాల్లోనూ 66 మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంటాయని, మూడు షిఫ్టుల్లో పని చేస్తారని తెలిపారు. ప్రతి టీమ్‌లో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు నర్సింగ్ ఆఫీసర్లు, ముగ్గురు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశా కార్యకర్తలతో పాటు మరో ముగ్గురు ల్యాబ్ టెక్నిషీయన్లు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ సేవల నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్‌లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ నేపథ్యంలో ఎమర్జెన్సీ సేవల నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 35 బేసిక్ లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లు, 30 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, 58 స్ట్రెచర్లు, 88 వీల్ చైర్స్ అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు.
తాజావార్తలు
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
- ●Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం
- ●Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
- ●Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్

Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి

Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం





