త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | నేడే ‘రైతు భ‌రోసా’ నిధులు విడుద‌ల‌.. కేవ‌లం 2 ఎక‌రాల‌కు వ‌ర‌కు మాత్ర‌మే..!

Rythu Bharosa | రాష్ట్రంలోని రైతాంగానికి శుభ‌వార్త‌. మంగ‌ళ‌వారం సాయంత్రం రైతు భ‌రోసా నిధులు విడుద‌ల కానున్నాయి. మొద‌ట‌గా కేవ‌లం 2 ఎక‌రాల వ‌ర‌కు మాత్ర‌మే రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌నున్నారు.

S

Telangana | Published On Jun 30, 2026, 6.20 am IST

Rythu Bharosa | నేడే ‘రైతు భ‌రోసా’ నిధులు విడుద‌ల‌.. కేవ‌లం 2 ఎక‌రాల‌కు వ‌ర‌కు మాత్ర‌మే..!
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని రైతాంగానికి శుభ‌వార్త‌. మంగ‌ళ‌వారం సాయంత్రం రైతు భ‌రోసా నిధులు విడుద‌ల కానున్నాయి. మొద‌ట‌గా కేవ‌లం 2 ఎక‌రాల వ‌ర‌కు మాత్ర‌మే రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌నున్నారు. మిగ‌తా వారికి ద‌శ‌ల‌వారీగా రైతు భ‌రోసా నిధులు జ‌మ చేయ‌నున్నారు. తొలి విడుత‌లో 41.37 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రైతు భ‌రోసా చెల్లించ‌నున్నారు. ఈ మేర‌కు రైతుల ఖాతాల్లో రూ. 2,482 కోట్లు జ‌మ కానున్నాయి.

వేదిక మార్పు

రైతు భ‌రోసా నిధుల‌ను ఖ‌మ్మం జిల్లా మ‌ధిర వేదిక‌గా విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో.. ఈ కార్య‌క్ర‌మం వేదిక‌ను ప్ర‌భుత్వం మార్చింది. ఖ‌మ్మం జిల్లా నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలోని శిల్పాక‌ళా వేదిక‌కు మార్చారు. శిల్పా క‌ళా వేదిక నుంచి సీఎం రేవంత్ సాయంత్రం 4 గంట‌ల‌కు రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేయ‌నున్నారు. రైతు వేదిక‌ల నుంచి రైతులంద‌రూ వ‌ర్చువ‌ల్‌గా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.

Advertisement
Advertisement