IFS Transfers | తెలంగాణలో ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీలు, పదోన్నతులు
IFS Transfers | రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ జీవోను జారీ చేసింది.
IFS Transfers | రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ జీవోను జారీ చేసింది. హనుమకొండ, జనగాం జిల్లాల అటవీ అధికారిగా కొనసాగుతున్న భూక్య లావణ్యను మహబూబాబాద్ డీఎఫ్‌వోగా నియమించింది. ఆమె స్థానంలో జీ ముకుంద్‌రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఆయనకు ఇది పదోన్నతి కావడం విశేషం. ఆయన ప్రస్తుతం ప్రధాన అటవీ సంరక్షణాధికారి కార్యాలయంలో డీఎఫ్‌వో (విజిలెన్స్-1)గా విధులు నిర్వహిస్తున్నారు. ఏ నర్సింహారెడ్డికి పదోన్నతి ఇస్తూ తెలంగాణ ఎస్‌సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ విభాగంలో పని చేస్తున్న డీ సంహితను ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ (FCA) డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా బదిలీ చేసింది. అలాగే, ఎం భోజికి పదోన్నతి కల్పిస్తూ మెదక్ జిల్లా అటవీ అధికారిగా కొనసాగిస్తూ ఉతర్వులు జారీ చేసింది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ జాయింట్ డైరెక్టర్‌గా జీబీ రేఖాబానును నియమించింది. ప్రధాన అటవీ సంరక్షణాధికారి కార్యాలయంలో డీఎఫ్‌వో (విజిలెన్స్-2)గా కొనసాగుతున్న రాజశేఖర్‌ను నల్గొండ జిల్లా డీఎఫ్‌వోగా పంపింది. బదిలీలు, పోస్టింగ్‌లో తక్షణం అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bandaravirala Dumping Yard | ఒకవైపు లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన.. మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాలోనే డంపింగ్ యార్డా? రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఫైర్!
- ●Petrol Diesel Restrictions Lifted | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత, జూలై 1 నుంచే అమలు
- ●IPS Transfers | తెలంగాణలో 12 ఐపీఎస్‌ల బదిలీ.. పలువురికి అదనపు బాధ్యతలు
- ●Ram Pothineni | మెగా ఫోన్ పట్టిన రామ్ పోతినేని - ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ
- ●Nabha Natesh | యాక్సిడెంట్ వల్ల ఏడాదిన్నర సినిమాలకు దూరం - సినిమా కోసం వెజిటేరియన్‌గా మారా - నభానటేష్ కామెంట్స్
- ●Prostitution Racket Busted | ముంబయిలో హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్దరు హీరోయిన్లను కాపాడిన పోలీసులు

Bandaravirala Dumping Yard | ఒకవైపు లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన.. మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాలోనే డంపింగ్ యార్డా? రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఫైర్!

Petrol Diesel Restrictions Lifted | పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత, జూలై 1 నుంచే అమలు

IPS Transfers | తెలంగాణలో 12 ఐపీఎస్‌ల బదిలీ.. పలువురికి అదనపు బాధ్యతలు

Ram Pothineni | మెగా ఫోన్ పట్టిన రామ్ పోతినేని - ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ





