Traffic Restrictions | సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.. 3 నెలల పాటు ఆ రహదారి మూసివేత
Traffic Restrictions | సైబరాబాద్( Cyberabad ) పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రిపుల్ ఐటీ జంక్షన్( IIIT Junction ) వద్ద బహుళ అంతస్తుల ఫ్లై ఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద బహుళ అంతస్తుల ఫ్లై ఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు జులై 1 నుంచి 3 నెలల పాటు అమల్లో ఉంటాయన్నారు. ఈ మూడు నెలల పాటు డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వరకు రహదారిని మూసివేయనున్నారు. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. నిర్మాణ పనులు సుమారు సంవత్సర కాలం పాటు కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు
అయితే మంగళవారం శిల్పా కళావేదికగా రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో మాదాపూర్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాదాపూర్, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్ పరిసరాలు, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Traffic Restrictions | ఇవాళ రాత్రి 10 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!
జూన్ 26, 2026

Traffic Restrictions | రాత్రి 8 వరకు.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్
జూన్ 21, 2026

Traffic Restrictions | కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు.. వన్‌వే ట్రయల్ రన్
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●FIFA 2026 | బ్రెజిల్ చేతిలో ఓటమి.. తలవంచి అభిమానులకు క్షమాపణలు చెప్పిన జపాన్ కోచ్ హజిమే
- ●Lightning strikes | 24 గంటల్లో 3 లక్షలకు పైగా పిడుగులు.. కాలిపోయిన పలు ఇండ్లు
- ●Paraguay Vs Germany | జర్మనీకి పరాగ్వే షాక్
- ●Brazil Vs Japan | బ్రెజిల్‌ను దాటేసిన జపాన్
- ●GENCO | జెన్కోలో ఉద్యోగాల భర్తీ.. 100 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- ●Rythu Bharosa | నేడే 'రైతు భరోసా' నిధులు విడుదల.. కేవలం 2 ఎకరాలకు వరకు మాత్రమే..!

FIFA 2026 | బ్రెజిల్ చేతిలో ఓటమి.. తలవంచి అభిమానులకు క్షమాపణలు చెప్పిన జపాన్ కోచ్ హజిమే

Lightning strikes | 24 గంటల్లో 3 లక్షలకు పైగా పిడుగులు.. కాలిపోయిన పలు ఇండ్లు

Paraguay Vs Germany | జర్మనీకి పరాగ్వే షాక్

Brazil Vs Japan | బ్రెజిల్‌ను దాటేసిన జపాన్



