త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPS Transfers | తెలంగాణ‌లో 12 ఐపీఎస్‌ల బ‌దిలీ.. ప‌లువురికి అద‌న‌పు బాధ్య‌త‌లు

IPS Transfers | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో ప‌లువురు ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే, ప‌లువురు అధికారుల‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర పోలీసు విభాగంలో పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు పేర్కొన్నారు.

P

Telangana | Published On Jun 29, 2026, 8.26 pm IST

IPS Transfers | తెలంగాణ‌లో 12 ఐపీఎస్‌ల బ‌దిలీ.. ప‌లువురికి అద‌న‌పు బాధ్య‌త‌లు
Advertisement

IPS Transfers | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో ప‌లువురు ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే, ప‌లువురు అధికారుల‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర పోలీసు విభాగంలో పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు పేర్కొన్నారు. కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా సీహెచ్ సింధూశ‌ర్మను నియ‌మించారు. మ‌ల్టీజోన్ 1 ఐజీగా రామ‌గుండం సీపీ అంబ‌ర్ కిశోర్ ఝాకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ జోయెల్ డేవిస్ యాదాద్రి జోన్ డీఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వ‌రంగ‌ల్ సీపీ సుప్రీత్ సింగ్‌ను బ‌దిలీ చేసి.. సైబ‌రాబాద్ టాఫ్రిక్ జాయింట్ సీపీగా నియ‌మించింది. రాజ‌న్న జోన్ స‌న్‌ప్రీత్ సింగ్ అద‌న‌పు బాధ్య‌త‌లు ఇచ్చింది ప్ర‌భుత్వం. హైదరాబాద్ నార్త్ జోన్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ ఎం శ్వేత‌ను వరంగల్ పోలీస్‌గా కమిషనర్‌గా నియమించారు.

ఆమెకు జోన్-6 డీఐజీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే, సీఐ సెల్ ఇంటెలిజెన్స్ డీఐజీ ఆర్ భాస్కరన్‌కు బాసర జోన్ అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను కేటాయించింది. స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్‌కు హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు ఇచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ జై శేఖర్‌ను బదిలీ చేసి సీఐ సెల్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమించారు. ఎస్ఐబీ ఎస్పీ అదనపు బాధ్యతల నుంచి త‌ప్పించారు. ఎస్ సాయి శేఖ‌ర్‌కు రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్‌ఎంఈఐటీ డిప్యూటీ కమిషనర్ చెరుకూరి రూపేశ్‌ను సీఐడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను కూడా సీఐడీ ఎస్పీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్ వెంక‌టేశ్వ‌ర్లును హైదరాబాద్ కార్ హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించింది. ప్ర‌భుత్వం ఇంతకుముందు ఇచ్చిన సీఐడీ ఎస్పీ పోస్టింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. వనపర్తి అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేశ్‌ మీనాను వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Advertisement

తాజావార్తలు

Advertisement