Lightning strikes | 24 గంటల్లో 3 లక్షలకు పైగా పిడుగులు.. కాలిపోయిన పలు ఇండ్లు
Lightning strikes | వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా మేఘాల్లో ఏర్పడే పీడనం, ఇతర పరిస్థితుల కారణంగా మెరుపులు ఏర్పడతాయి. ఉరుములు సంభవిస్తాయి. ఈ ఉరుములు, మెరుపులు భయంకరంగా ఉంటాయి.
International | Published On Jun 30, 2026, 8.05 am IST
Lightning strikes | త్రినేత్ర.న్యూస్ : వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా మేఘాల్లో ఏర్పడే పీడనం, ఇతర పరిస్థితుల కారణంగా మెరుపులు ఏర్పడతాయి. ఉరుములు సంభవిస్తాయి. ఈ ఉరుములు, మెరుపులు భయంకరంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ మెరుపు భూమిని తాకడంతో విద్యుత్ ప్రసరితమై పిడుగులు సంభవిస్తాయి. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడుతాయి. ఇంత ప్రాణాంతకమైన ఉరుములు, మెరుపులు, పిడుగులు నెదర్లాండ్స్‌ను వణికించాయి.
2026 జూన్ 28వ తేదీన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డమ్‌లో ప్రకృతి విపత్తు సంభవించింది. 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా పిడుగులు పడ్డాయి. మెరుపులతో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతంగా కాగా, మరోవైపు ఉరుములతో ఆకాశం దద్దరిల్లింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఏకధాటి పిడుగులపై నెదర్లాండ్స్ వాతావరణ కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 24 గంటల్లో 3,00,000లకు పైగా పిడుగులు పడ్డాయని అధికారికంగా వెల్లడించింది. నార్తర్న్ జర్మనీలో ఒక్క అర గంటలోనే 30 వేలకు పైగా పిడుగులు ఏర్పడ్డాయని తెలిపింది. అంటే కనురెప్ప తెరిచి మూసేలోపే సగటున 17 పిడుగులు సంభవించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో పిడుగులు పడ్డ ప్రాంతాల్లో కోడ్ రెడ్ ప్రకటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. పిడుగుల ధాటికి పలు ఇండ్లు కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
I have truly witnessed an unbelievable thunderstorm outbreak in Amsterdam tonight. We’re going on 4 hours straight of constant lightning and downpours.
At peak ~30,000 strikes were detected in 30 min across Netherlands and northern Germany, ~17 lightning strikes a second. pic.twitter.com/PYKDRihhqY
— Colin McCarthy (@US_Stormwatch) June 28, 2026
మన దేశంలో రుతుపవనాలు ప్రవేశించే సమయంలో ఇలాంటి మెరుపులు, ఉరుములు, పిడుగులు సంభవిస్తాయి. కానీ నిత్యం చల్లని ప్రాంతంగా నెదర్లాండ్స్‌లో మాత్రం ఇలా మెరుపులు, పిడుగులు సంభవించడం అరుదు. అయితే ఐరోపా ఖండంలో రికార్డు స్థాయిలో వేడిగాలుల తీవ్రత కొనసాగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో వారం రోజులకు పైగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలోనే ఒక్కసారిగా చల్లని గాలులు వీచాయి. వేడి, తేమతో కూడిన గాలి ఆకాశంలో ఢీకొన్నప్పుడు ఒక్కసారిగా ఇలాంటి విపత్తు ఏర్పడి పిడుగులు పడ్డాయని నిపుణులు పేర్కొన్నాయి.
incredible lightening shows in amsterdam #onweer pic.twitter.com/H3hVMWdjAI
— sam ✨ (@alljusthesame) June 27, 2026
After more than a week of high temperatures, a severe storm is now sweeping through the Netherlands.
This is in my hometown Tilburg right now. I've never seen this before!#storm #lightning pic.twitter.com/r8yEXmN7hc— ⚔️ 𝕷𝖔𝖗𝖉 𝕶𝖓𝖎𝖌𝖍𝖙 ⚔️ (@lordknight_ai) June 28, 2026
తాజావార్తలు
- ●FIFA 2026 | బ్రెజిల్ చేతిలో ఓటమి.. తలవంచి అభిమానులకు క్షమాపణలు చెప్పిన జపాన్ కోచ్ హజిమే
- ●Paraguay Vs Germany | జర్మనీకి పరాగ్వే షాక్
- ●Traffic Restrictions | సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.. 3 నెలల పాటు ఆ రహదారి మూసివేత
- ●Brazil Vs Japan | బ్రెజిల్‌ను దాటేసిన జపాన్
- ●GENCO | జెన్కోలో ఉద్యోగాల భర్తీ.. 100 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- ●Rythu Bharosa | నేడే 'రైతు భరోసా' నిధులు విడుదల.. కేవలం 2 ఎకరాలకు వరకు మాత్రమే..!

FIFA 2026 | బ్రెజిల్ చేతిలో ఓటమి.. తలవంచి అభిమానులకు క్షమాపణలు చెప్పిన జపాన్ కోచ్ హజిమే

Paraguay Vs Germany | జర్మనీకి పరాగ్వే షాక్

Traffic Restrictions | సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.. 3 నెలల పాటు ఆ రహదారి మూసివేత

Brazil Vs Japan | బ్రెజిల్‌ను దాటేసిన జపాన్






