త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar vs Nara Lokesh | రేవంత్ చేతులెత్తేశాకే ఆ లొంగుబాటు.. నారా లోకేష్‌కు ఆర్ఎస్‌ ప్రవీణ్ స్ట్రాంగ్ రిప్లై!

బండి సంజయ్ తన కొడుకును పోలీసులకు అప్పగించారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

J

Telangana | Published On Jul 15, 2026, 8.28 pm IST

RS Praveen Kumar vs Nara Lokesh | రేవంత్ చేతులెత్తేశాకే ఆ లొంగుబాటు.. నారా లోకేష్‌కు ఆర్ఎస్‌ ప్రవీణ్ స్ట్రాంగ్ రిప్లై!

సంక్షిప్త సారాంశం

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకును పోలీసులకు సరెండర్ చేయడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్‌కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా బదులిచ్చారు. తొమ్మిది రోజుల పాటు బీఆర్ఎస్ చేసిన పోరాటం, సోషల్ మీడియా ఒత్తిడి వల్లే ఈ లొంగుబాటు జరిగిందని ఆయన ఆరోపించారు. బాధితురాలిపై సోషల్ మీడియాలో మూకుమ్మడి దాడి చేసి, హనీ ట్రాప్ కేసు పెట్టినా ఆమె బెదరలేదని గుర్తుచేశారు. మహిళల పట్ల నిజమైన గౌరవం ఉంటే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎన్డీయేను డిమాండ్ చేయాలని లోకేష్‌కు సవాల్ విసిరారు.

Advertisement

RS Praveen Kumar vs Nara Lokesh | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) తన కొడుకును పోలీసులకు అప్పగించడాన్ని సమర్థిస్తూ ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. లోకేష్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) X వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. పోక్సో (POCSO) కేసులో దయచేసి పూర్తి నిజాలు తెలుసుకుని మాట్లాడాలని చురకలంటించారు.

ఆడబిడ్డపై ఏడాది పాటు వేధింపులు

"మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు. ఆ బిడ్డపై ఏడాది పాటు వేధింపులు, అత్యాచార యత్నాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ తండ్రికి తెలియకుండానే జరిగి ఉంటాయా? 2023లో తోటి విద్యార్థులను చితకబాదితే ఇదే సంజయ్ గారు తన కొడుకును వెనకేసుకురాలేదా?" అని లోకేష్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.

9 రోజుల పోరాటం వల్లే లొంగుబాటు

బండి సంజయ్ తన కొడుకును పోలీసులకు అప్పగించింది నిజమే అయినప్పటికీ, ఆ పని మొదటి రోజే ఎందుకు చేయలేదని ఆర్ఎస్‌పీ నిలదీశారు. తెలంగాణ ఆడబిడ్డల పక్షాన బీఆర్ఎస్ (BRS) పార్టీ 9 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేయడం వల్లే ఈ లొంగుబాటు జరిగిందని స్పష్టం చేశారు. బాధితురాలి క్యారెక్టర్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో (Social Media) మూకుమ్మడి దాడి చేశారని, కరీంనగర్‌లో హనీ ట్రాప్ కేసు పెట్టినా ఆమె బెదరలేదని గుర్తుచేశారు. కోర్టులో ఆ బిడ్డ వయసు మీద కూడా నానా రాద్దాంతం చేశారని మండిపడ్డారు.

రేవంత్ చేతులెత్తేసిన తర్వాతే సరెండర్

ప్రధాన మీడియాను మేనేజ్ చేసినా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగడం, తన ప్రాణ మిత్రుడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) "ఇక మీ వాడిని దాచడం నా వల్ల కాదు" అని చేతులెత్తేసిన తర్వాతే సరెండర్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పోలీసులకు అప్పగించారని విమర్శించారు.

ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పండి

ఆ బిడ్డ తన వాంగ్మూలంలో కేంద్ర మంత్రి సంజయ్ పేరు కూడా చెప్పిందని, మీకు ఆయన బాగా పరిచయం ఉంటే పోలీసులకు సరెండర్ కావాలని చెప్పాలన్నారు. "మీకు మహిళల మీద నిజంగా గౌరవం, ప్రేమ ఉంటే.. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయకపోతే ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరిక జారీ చేయండి. నేను అడిగినట్లు చంద్రబాబు గారికి చెప్పగలరు" అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్‌లో ముగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement