త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | మీ ప‌ని మీరు చూసుకోండి.. ఎలాన్ మ‌స్క్‌కు డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కౌంట‌ర్‌..

RS Praveen Kumar | రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని భార‌త ప్ర‌ధానిగా సంబోధించిన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మ‌స్క్‌కు బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. ఈ మేర‌కు ప్ర‌వీణ్ కుమార్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు.

S

Telangana | Published On Oct 10, 2026, 12.32 pm IST

RS Praveen Kumar | మీ ప‌ని మీరు చూసుకోండి.. ఎలాన్ మ‌స్క్‌కు డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కౌంట‌ర్‌..
Advertisement

RS Praveen Kumar | రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని భార‌త ప్ర‌ధానిగా సంబోధించిన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మ‌స్క్‌కు బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. ఈ మేర‌కు ప్ర‌వీణ్ కుమార్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. అంబానీ, అదానీ బ‌డా సంప‌న్నులు, పారిశ్రామిక వేత్త‌లని, దేశ ప్ర‌జ‌లపై గుత్తాధిప‌త్యం చెలాయిస్తున్నార‌ని త‌మ‌కు తెలుస‌ని, అయితే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా వారిని ఎలా ఎదుర్కోవాలో త‌మ‌కు తెలుస‌ని, మ‌స్క్ ఆ విష‌యాల‌ను భార‌తీయుల‌కు నేర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని హిత‌వు ప‌లికారు. స్పేస్ ఎక్స్, స్టార్ లింక్ అధినేత‌గా మ‌స్క్‌ను గౌర‌విస్తామ‌ని, కానీ అందుకు భార‌త సార్వ‌భౌమ‌త్వాన్ని మాత్రం ప‌ణంగా పెట్ట‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు.

అంబానీని ప్ర‌ధానిగా పేర్కొంటూ..

భార‌త్‌లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్‌ సేవ‌ల‌ను అందించేందుకు గాను ఎలాన్ మ‌స్క్ ఆధ్వ‌ర్యంలోని బృందం గ‌త ఐదేళ్లుగా అనుమ‌తుల కోసం వేచి చూస్తోంది. ఇప్ప‌టికే ఆ సంస్థ‌కు రావ‌ల్సిన అనుమ‌తులు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. కానీ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల ప‌రంగా రిస్క్ ఉంద‌ని కేంద్రం భావిస్తోంది. అందుక‌నే విదేశీ సంస్థ అయిన స్టార్ లింక్‌కు ఇంకా అనుమ‌తుల‌ను మంజూరు చేయ‌లేదు. మ‌రోవైపు ఇవే సేవ‌ల కోసం రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి చెందిన జియో, భార‌తీ ఎయిర్‌టెల్ కూడా ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. అయితే స్టార్ లింక్‌తోపాటు ఈ రెండు సంస్థ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా సెక్యూరిటీ ప‌రంగా అనుమ‌తులు ల‌భించ‌లేదు. కానీ ఎలాన్ మస్క్ త‌మ‌కు 5 ఏళ్లు అయినా ఇంకా అనుమ‌తులు రావ‌డం లేద‌ని ఆరోపిస్తూ గ‌త వారం రోజులుగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ముకేష్ అంబానీల‌పై త‌న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మ‌స్క్ మ‌రోమారు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అంబానీని ఏకంగా భార‌త ప్ర‌ధాని అంటూ సంబోధించారు.

https://twitter.com/elonmusk/status/2108604227643719745?s=20

పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌రా..?

ముకేష్ అంబానీని భార‌త ప్ర‌ధానిగా పేర్కొన్న మ‌స్క్ త‌న ఎక్స్ పోస్టులో ఇంకా ప‌లు విష‌యాల‌ను రాసుకొచ్చారు. అంబానీ భార‌త్‌కు అసలైన బాస్ అని తాను గుర్తించ‌లేక‌పోయాన‌ని, అందుకు తాను విన‌య‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని మ‌స్క్ అన్నారు. స‌హ‌జంగానే భార‌త్‌లోని ప్ర‌జ‌ల‌ను గుత్తాధిప‌త్య ప‌ద్ధ‌తిలో దోపిడీ చేయ‌డాన్ని అంబానీ కొన‌సాగించాల‌నుకుంటున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ స్టార్ లింక్‌కు పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌డం గురించి ఒక‌సారి ఆలోచించాల‌ని కోరారు. భార‌త్‌లోనే కాకుండా అన్ని దేశాల్లోనూ ఇంట‌ర్నెట్ స‌దుపాయం లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయ‌ని, దీని వ‌ల్ల పిల్ల‌ల‌కు విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశం, చిరు వ్యాపారుల‌కు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌పంచ మార్కెట్‌ల‌లో విక్ర‌యించే అవ‌కాశం లేకుండా పోతుంద‌ని పేర్కొన్నారు. స్టార్ లింక్ వారి జీవితాల‌ను మెరుగైన దిశ‌లో మారుస్తుంద‌ని అన్నారు.

https://twitter.com/RSPraveenSwaero/status/2108799646424592635?s=20

మీ ప‌ని మీరు చూసుకోండి: ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

మ‌స్క్ తాజాగా పెట్టిన పోస్టుపై డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పందిస్తూ అంబానీలు, అదానీలు ఒలిగార్క్‌లు అని త‌మ‌కు తెలుస‌ని స్ప‌ష్టం చేశారు. వారు న‌రేంద్ర మోదీ, రాహుల్ గాంధీ లేదా అధికారంలో ఎవ‌రున్నా వారితో స‌న్నిహితంగా ఉంటార‌ని కూడా త‌మ‌కు తెలుస‌ని, అదే వారి మ‌నుగడ వ్యూహ‌మ‌ని అన్నారు. కానీ త‌మ ప్ర‌జాస్వామ్య దేశానికి అలాంటి ఒలిగార్క్‌ల‌ను ఎలా ఎదుర్కోవాలో తెలుస‌ని, త‌మ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై త‌మ‌కు ఎవ‌రూ పాఠాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంట‌ర్నెట్ ఎంత వేగంగా త‌మ గ్రామాలు, మారుమూల ప్రాంతాల‌కు చేరిందో, అది ఎంత త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి వ‌చ్చిందో మ‌స్క్ లాంటి వారికి అస‌లు తెలియ‌ద‌ని, వాస్త‌వానికి పాశ్చాత్య దేశాల్లో క‌న్నా భార‌త్‌లోనే ఇంట‌ర్నెట్ విస్త‌ర‌ణ ఎక్కువ వేగంగా జ‌రిగింద‌ని తెలిపారు. మ‌స్క్ త‌న సొంత దేశంపై దృష్టి పెడితే బాగుంటుంద‌ని, గొప్ప ఉత్ప‌త్తుల‌ను అభివృద్ధి చేయ‌డంలో త‌న‌ స‌మ‌యాన్ని వినియోగిస్తే మంచిద‌ని సూచించారు. భార‌త అంత‌ర్గ‌త వ్యహారాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని, దేశ ప్ర‌జ‌లే దీన్ని చూసుకుంటార‌ని అన్నారు.

Advertisement
Advertisement